Share News

Kidney Health: నిత్యం ఇలా చేయకపోయారో.. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నట్టే

ABN , Publish Date - Aug 10 , 2024 | 02:56 PM

మూత్రపిండాల పనితీరును మెరుగుపడటానికి తగినపాళ్లలో నీరు శరీరానికి అందడం ముఖ్యం. కిడ్నీ(Kidney Health) సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే రోజూ నీరు తాగడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యానికి రోజులో ఎంత నీరు తాగాలి, నీరు ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం.

Kidney Health: నిత్యం ఇలా చేయకపోయారో.. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నట్టే

ఇంటర్నెట్ డెస్క్: మానవ శరీరంలో ప్రతి అవయం వేటికవే ప్రత్యేకత కలిగి ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. అవయవాలు సక్రమంగా పనిచేయడానికి ఆహారం, నీరు రెండూ అవసరమే. ముఖ్యంగా మూత్రపిండాల పనితీరును మెరుగుపడటానికి తగినపాళ్లలో నీరు శరీరానికి అందడం ముఖ్యం. కిడ్నీ(Kidney Health) సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే రోజూ నీరు తాగడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యానికి రోజులో ఎంత నీరు తాగాలి, నీరు ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం.

తక్కువ నీరు తాగితే..

మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి నీరు అవసరం. శరీరంలో నీటి కొరత ఏర్పడితే, డీహైడ్రేషన్‌ గురవుతాం. అలాంటప్పుడు ముందుగా ప్రభావితమయ్యేది కిడ్నీలే. దీని వల్ల శరీరంలో చెడు వ్యర్థాలు పేరుకుపోయి మూత్రపిండాలు దెబ్బతింటాయి. తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI), కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా దారి తీయవచ్చు.


కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..

ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం... ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజులో తప్పకుండా 3-4 లీటర్ల నీరు త్రాగాలి. అయితే ఈ నియమం మీ లింగం, పని, వాతావరణం, శరీర స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఇది మూత్రాన్ని పలుచన చేయడం, శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఈ సమస్యలుంటే నీరు తక్కువ తాగాలి..

మరి అందరూ ఎక్కువ నీటిని తాగవచ్చా అంటే.. తాగకూడదని చెబుతున్నారు వైద్యులు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువ నీరు తీసుకోకూడదట. ఎంత నీరు తాగాలో వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలట. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న వారు, కిడ్నీ డయాలసిస్ అవసరం ఉన్నవారు తక్కువ నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి.. శాశ్వతంగా పనిచేయకపోవచ్చు.

Updated Date - Aug 10 , 2024 | 02:57 PM