Health: ప్రీబయోటిక్స్.. ప్రోబయోటిక్స్.. ఈ రెండిటి మధ్య తేడా తెలుసా?
ABN , Publish Date - Aug 18 , 2024 | 10:30 PM
జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ రెండూ కీలకమని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం!
ఇంటర్నెట్ డెస్క్: పోషకాహారం తినాలనుకునే వారి నోట ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాటలు.. ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్.. అంటే ఏంటో చాలా మందికి తెలిసినప్పటికీ ప్రీబయోటిక్స్ అంటే మాత్రం చాలా మందికి అవగాహన ఉండదనే చెప్పాలి. అయితే, పేగుల ఆరోగ్యానికి (Health) ఈ రెండూ కీలకమని నిపుణులు చెబుతున్నారు.
ఏమిటీ ప్రీ, ప్రోబయోటిక్స్..
మన పేగుల్లో ఉండే హితకర బ్యాక్టీరియానే ప్రోబయోటిక్స్ అని పిలుస్తారు. వీటిని క్యాప్సుల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. యాంటిబయాటిక్స వాడకం కారణంగా తగ్గిపోయిన హితకర బ్యాక్టీరియా సంఖ్యను పునరుద్ధరించేందుకు వైద్యులు ప్రోబయోటిక్స్‌ను సూచిస్తుంటారు. ఇక ప్రీబయోటిక్స్ అంటే మనం జీర్ణించుకోలేని ఒకరమైన పీచు పదార్థం. మన పేగుల్లోని హితకర బ్యాక్టీరియా వీటిని ఆహారంగా తీసుకుంటాయన్నమాట (Difference between pre and probiotics).
ఇక ప్రీబయోటిక్స్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. రోగనిరోధక శక్తి ఇనుమడించేందుకు, శారీరక, మానిసక ఆరోగ్యాలు మెరుగయ్యేందుకూ ప్రోబయోటిక్స్ అత్యవసరం. ఇక అనారోగ్య సమయాల్లో ఈ రెండూ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
న్యూ్ట్రిషనిస్టుల ప్రకారం, పెరుగు, బటర్‌మిల్క్, పులిసిన వస్తువుల్లో ఈ ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చి అరిటికాయల్లో ప్రీబయాటిక్స్ మెండుగా ఉంటాయట. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుండాలంటే ఈ రెండింటినీ సమపాళ్లల్లో తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.