Insomnia: రోజుకు 3-4 గంటలకు మించి నిద్రపోకపోతే జరిగేదిదే..వైద్యుల హెచ్చరిక
ABN , Publish Date - Feb 12 , 2024 | 09:43 PM
క్వాలటీ నిద్ర లేకపోతే గుండె సమస్యలు, క్యాన్సర్ సహా పలు అనారోగ్యాల పాల పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా సరే తిండి, నిద్రను నిర్లక్ష్యం చేయకూడదనేది పెద్దల మాట. వైద్యులు కూడా ఇదే చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రను నిర్లక్ష్యం చేస్తే పలు సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పనుల్లో బిజీగా ఉన్నామంటూ రోజుకు 3-4 గంటలకు మించి నిద్రపోని వారు సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది పలు విపరిణామాలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో 30 శాతం మంది నిద్రలేమితో ఇబ్బందిపడుతున్నారట. ముఖ్యంగా రోజుకు 3 -4 గంటలకు మించి నిద్రపోని వారికి గుండె సంబంధిత సమస్యలతో పాటు పలు ఇతర అనారోగ్యాలు వస్తాయని చెబుతున్నారు (what happens when you spleep for not more that 4 hours a day).
నిద్రలేమితో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ఇన్‌ఫ్లెక్షన్స్‌ను అడ్డుకునే శక్తి శరీరానికి ఉండదు
రోజుకు 5-6 గంటలకంటే తక్కువగా నిద్రపోయే వారు గుండె సంబంధిత సమస్యల పాలపడాల్సి వస్తుంది. గుండెపోటు వంటివి రావచ్చు
నిద్రతక్కువైతే బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ప్రోస్ట్రేట్ క్యాన్సర్ వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది. క్యాన్సర్ బాధితుల్లో సగం మంది నిద్రలేమితో కూడా బాధపడుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.
కంటి నిండా నిద్రపట్టాలంటే..
నిపుణులు చెప్పేదాని ప్రకారం, వృద్ధులకు 7-8 గంటల నిద్ర అవసరం. టీనేజర్లకు 8-10 గంటల నిద్రకావాలి. ఇక రెండేళ్ల లోపు వయసున్న చిన్నారులు రోజుకు 11-14 గంటల పాటు నిద్రపోవాలి
మంచి నిద్రపట్టేందుకు షెడ్యూల్ పాటించాలి. ప్రతి రోజూ ఒకే టైమ్‌కి నిద్రపోవాలి. నిద్రకు ఉపక్రమించేందుకు మనసును నెమ్మదింపజేసే పనులను చేయాలి. మంచి మ్యూజిక్ వినడం వంటివి చేయచ్చు. రాత్రి పడుకునే ముందు వరకూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకూడదు. బెడ్‌రూంలో కాంతి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ టిప్స్ యథాతథంగా పాటిస్తే రోజూ కంటినిండా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.