Share News

White Hair: బీట్రూట్ జ్యూస్ తో భలే మ్యాజిక్.. ఇలా చేస్తే తెల్ల జుట్టు మాయం..!

ABN , Publish Date - Oct 05 , 2024 | 01:02 PM

మార్కెట్లో దొరితే కెమికల్ హెయిర్ డై లకు బదులుగా బీట్రూట్ తో చేసే హెయిర్ డై వాడితే మ్యాజిక్కే..

White Hair: బీట్రూట్ జ్యూస్ తో భలే మ్యాజిక్.. ఇలా చేస్తే తెల్ల జుట్టు మాయం..!
White Hair

తెల్ల జుట్టు ఇప్పట్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తోంది. చాలామంది తెల్లజుట్టుతో కనిపించాలంటే ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకోసమే హయిర్ డై వేస్తుంటారు. అయితే మార్కెట్లో దొరికే హెయిర్ డైలు తెల్లజుట్టును తాత్కాలికంగా కవర్ చేస్తాయి. కానీ మెదడు లోపలి నరాలను దారుణంగా దెబ్బతీస్తాయి. దీని కారణంగా చిన్న వయసులోనే మతిమరుపు, అల్జీమర్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అలా కాకుండా బీట్రూట్ జ్యూస్ తో ఈజీగా తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు.

బీట్రూట్ జ్యూస్ తో..

బీట్రూట్ జ్యూస్ తో తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు. బీట్రూట్ జ్యూస్ జుట్టుకు చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ, విటమిన్-సి జుట్టుకు మేలు చేసే కెరోటిన్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు నెరిసే ప్రక్రియను నెమ్మిదిస్తాయి. బీట్రూట్ జ్యూస్ లో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది.

Vitamin-B12: విటమిన్-బి12 సప్లిమెంట్లు వాడుతున్నారా? వీటిని తీసుకోవడానికి సరైన సమయం తెలుసా?


బీట్రూట్ హెయిర్ డై..

బీట్రూట్ హెయిర్ డై కోసం కావలసిన పదార్థాలు..

బీట్రూట్ జ్యూస్..

ఉసిరి పొడి.. ఒక చెంచా

ఆలివ్ నూనె.. ఒక చెంచా

అల్లం రసం.. ఒక చెంచా

తయారీ విధానం..

బీట్రూట్ జ్యూస్ లో పైన చెప్పిన పదార్థాలు అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి సుమారు రెండు గంటలు అలాగే ఉంచాలి. రెండు గంటల తరువాత సాధారణ నీటితో జుట్టును కడుక్కోవాలి. ఈ హెయిర్ డై తో జుట్టు ముదురు రంగులోకి మారుతుంది.

ఇందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేకపోవడం వల్ల ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండదు. ఈ హెయిర్ డై ను వారానికి ఒకసారి అప్లై చేస్తుంటే తెల్ల జుట్టు తొందరలోనే నల్లగా మారుతుంది.

ఇవి కూడా చదవండి..

Vitamin-B12: విటమిన్-బి12 సప్లిమెంట్లు వాడుతున్నారా? వీటిని తీసుకోవడానికి సరైన సమయం తెలుసా?

Bed Sheet: పరుపు మీద వాడే బెడ్ షీట్లను ఎన్ని రోజులకు ఉతకాలి? చాలా మందికి తెలియని నిజాలివీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 05 , 2024 | 02:31 PM