Share News

White Hair: హెన్నాలో ఈ రెండు మిక్స్ చేసి రాస్తే చాలు.. తెల్ల జుట్టుకు రంగు వెయ్యక్కర్లేకుండా నల్లగా అవ్వుద్ది..!

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:41 PM

మార్కెట్ హెయిర్ డైలు తాత్కాలికంగా జుట్టుకు నలుపును ఇచ్చినా క్రమంగా మెదడు నరాలను బలహీనంగా మార్చి మతిమరుపు వంటి సమస్యలు రావడానికి దారితీస్తుంది. అందుకే..

White Hair: హెన్నాలో ఈ రెండు మిక్స్ చేసి రాస్తే చాలు.. తెల్ల జుట్టుకు రంగు వెయ్యక్కర్లేకుండా నల్లగా అవ్వుద్ది..!
White hair

ఇప్పట్లో తెల్లజుట్టు చాలామందికి సమస్యగా మారింది. ముఖ్యంగా యువతే ఎక్కువగా తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తెల్లజుట్టు కవర్ చేయడానికి మార్కెట్లో దొరితే హెయిర్ డైలు కూడా వాడుతుంటారు. కానీ మార్కెట్ హెయిర్ డైలు తాత్కాలికంగా జుట్టుకు నలుపును ఇచ్చినా క్రమంగా మెదడు నరాలను బలహీనంగా మార్చి మతిమరుపు వంటి సమస్యలు రావడానికి దారితీస్తుంది. అందుకే చాలామంది సహజ పద్దతులలో జుట్టును నల్లగా మార్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వారికోసం సూపర్ టిప్ ను అందించారు కేశ సంరక్షణ నిపుణులు. హెన్నాలో కేవలం రెండు పదార్థాలు మిక్స్ చేసి జుట్టుకు రాస్తే చాలు.. అసలు హెయిర్ డై వెయ్యాల్సిన అవసరం ఉండదు. అవేంటో తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!


పసుపు..

తెల్లజుట్టును నల్లగా మార్చడానికి పసుపు బాగా సహాయపడుతుందట. పసుపులో ఐరన్, కాపర్ వంటి ఔషద గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. కేవలం నల్లగా మాత్రమే కాకుండా జుట్టుకు సహజ మెరుపు ఇవ్వడంలో కూడా ఇవి సహాయపడతాయి.

ఉసిరి పొడి..

ఉసిరికాయలు జుట్టు సంరక్షణలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు ఉసిరికాయ జ్యూస్ ను కూడా రెగ్యులర్ గా తీసుకుంటారు. మరికొందరు ఉసిరికాయ పొడిని హెన్నా పౌడర్ లో మిక్స్ చేసి తలకు పెట్టుకుంటారు. ఇక ఉసిరికాయను షాంపూలు, హెయిర్ ఆయిల్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. అయతే ఉసిరికాయను, పసుపును హెన్నా పొడిలో కలిపి జుట్టుకు అప్లై చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. దీన్నెలా రెఢీ చేసుకోవాలంటే..

గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!


హెన్నా మిక్స్..

  • పసుపు, ఉసిరికాయ పొడిని హెన్నా పొడిలో నేరుగా మిక్స్ చేయకూడదు.

  • ఒక ఐరన్ బాండీ తీసుకుని అందులో ఒక చెంచా పసుపు, రెండు చెంచాల ఉసిరికాయ పొడి వేసి బాగా వేయించాలి. ఉసిరికాయ పొడి, పసుపు రెండూ నల్లగా మారేవరకు వేయించిన తరువాత స్టౌ ఆఫ్ చేసి అది చల్లారే వరకు దాన్ని ఒకవైపు ఉంచాలి.

  • జుట్టు పరిమాణాన్ని బట్టి అవసరమైనంత హెన్నా పొడిని తీసుకుని అందులో వేయించుకున్న పసుపు, ఉసిరికాయ మిశ్రమం, అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. దీంతో నేచురల్ హెయిర్ డై సిద్దమైనట్టే.

  • తయారుచేసుకున్న నేచురల్ హెయిర్ డై ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటూ అలాగే ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

  • ఈ హెయిర్ డై ను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తుంటే తొందరలోనే తెల్లజుట్టు పూర్తీగా మాయమవుతుంది. జుట్టు నల్లగా తుమ్మెద రెక్కల్లా మారుతుంది. అంతేకాదు మంచి మెరుపుతో కూడా ఉంటుంది.

ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!

త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 16 , 2024 | 09:41 PM