Share News

Health: ఇది తెలిస్తే.. చన్నీటి స్నానం వెంటనే మానేస్తారు!

ABN , Publish Date - Aug 10 , 2024 | 09:09 PM

చన్నీటి స్నానం కారణంగా గుండె వేగం పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. హృద్రోగ బాధితులు చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Health: ఇది తెలిస్తే.. చన్నీటి స్నానం వెంటనే మానేస్తారు!

ఇంటర్నెట్ డెస్క్: చన్నీటి స్నానంతో ఎన్ని ఉపయోగాలు (Health) తెలిసిందే. చన్నీటి స్థానంతో ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరగడం, ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం, ఒత్తిడి, అలసట తగ్గడం వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఒంటిమీద చన్నీళ్లు పడితే..గుండె వేగం పెరుగుతుందట. ఆక్సీజన్ కూడా అధికంగా తీసుకుంటారట. అయితే, హృద్రోగులకు చన్నీటి స్నానంతో అనేక ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సడెన్‌గా గుండె పోటు, స్ట్రోక్ రావచ్చని హెచ్చరిస్తున్నారు (Why cold showers can lead to heart attacks).

Walking Vs Jogging: వాకింగ్ లేదా జాగింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..!


చన్నీటితో ప్రమాదం ఇదీ..

వైద్యులు చెప్పే దాని ప్రకారం, గుండెకు అకస్మాత్తుగా రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు హార్ట్‌ ఎటాక్ వస్తుంది. రక్తసరఫరా నిలిచిపోయేందుకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిల్లో రక్తం గడ్డకట్టడం ప్రధానమైనది. చల్లటి నీరు ఒంటిపై పడ్డప్పుడు ఒక్కసారిగా చర్మం కింద రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త సరఫరాకు అడ్డంకులు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గుండె మరింత వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యవ్వనంలో ఉన్న వారు కూడా అకస్మాత్తుగా గుండె పోటు బారిన పడొచ్చని వైద్యులు చెబుతున్నారు.


గుండెపోటు లక్షణాలు ఇవీ..

గుండె పోటు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో మధ్యస్థంగా మరికొందరిలో తీవ్రంగా ఉంటాయని అన్నారు. గుండెపోటు వచ్చే ముందు, ఛాతిలో ఒత్తిడి పెరిగినట్టు ఉండటం, నొప్పిగా అనిపించడం, భుజాల్లో అసౌకర్యం, వీపు, దవడ, పళ్లు, కడుపులో నొప్పిగా అనిపించడం, చల్లగా ఉన్నా చమటలు పట్టడం, ఛాతిలో మంటగా అనిపించడం, అరగనట్టు అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తాయట. కాబట్టి, హృద్రోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న వారు తరచూ తమ హెల్త్ చెకప్‌లు చేయించుకుంటూ తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెట్టి ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 10 , 2024 | 09:58 PM