Share News

Heart Attack in Men: మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ! ఎందుకంటే..

ABN , Publish Date - Sep 29 , 2024 | 03:24 PM

మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, హర్మోన్స్‌లో తేడాలు, శారీరకపరమైన ఇతర కారణాల రీత్యా పురుషులకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

Heart Attack in Men: మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ! ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, హర్మోన్స్‌లో తేడాలు, శారీరకపరమైన ఇతర కారణాల రీత్యా పురుషులకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ (Health). ప్రపంచ ఆరోగ్య సంస్థ డాటా ప్రకారం, ఏటా 17.9 మిలియన్ల మంది హృద్రాగాల బారిన పడి మరణిస్తున్నారు. అంతేకాకుండా, చిన్న వయసులో హార్ట్ ఎటాక్ బారిన పడే అవకాశాలు పురుషుల్లోనే ఎక్కువని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Coconut: ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?


హార్ట్ ప్రమాదం పురుషుల్లో ఎక్కువగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. స్త్రీల్లో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ గుండెపోటును రక్షణ కల్పిస్తోంది. ఇది శరీరంలోని కొలెస్టెరాల్ స్థాయిలను నియంత్రిస్తూ రక్తనాణాలు సులువుగా సంకోచవ్యాకోచాలకు లోనయ్యేలా చేస్తుంది. దీంతో, గుండెకు రక్తసరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవట. పురుషుల్లో ఇందుకు ఛాన్స్ లేదుకాబట్టి వారికి హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతుంది. ఇక మెనోపాస్ తరువాత ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గినా కూడా పురుషులంటే వారిలో పదేళ్లు ఆలస్యంగా హార్ట్ ఎటాక్ వస్తుందని అధ్యయనాలు తేలుస్తున్నాయి (Why men are more prone to heart disease than women).

Coconut: ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

జీవనశైలి అంశాలు కూడా పురుషుల్లో హార్ట్ అటాక్ అవకాశాలు పెంచుతున్నాయి. ధూమపానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, నిత్యం కూర్చీల్లో కూర్చుని పనిచేయటాలు వంటివి ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ధూమపానంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అవి కుంచించుకుపోతాయి. గుండె రక్తనాళాల్లోనూ ప్లాక్స్ ఏర్పడి గుండెకు రక్తసరఫరా తగ్గి చివరకు గుండె పోటు వస్తుంది. ధూమ పానం అలవాటు పురుషుల్లోనే ఎక్కువ కాబట్టి వారికి హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. దీనితో తోడుగా మద్యపానం కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తుందని అంటున్నారు.

Protect your Hearing: మీ వినికిడి శక్తి కలకాలం నిలిచుండాలంటే ఇలా చేయండి!


ఇక అధిక ఒత్తిడితో కూడి జాబ్స్‌ పురుషులే ఎక్కువగా చేయడం కూడా వారిలో హార్ట్ ఎటాక్ అవకాశాల్ని పెంచుతాయట. ఒత్తిడిని ఎదుర్కొనే తీరులో కూడా స్త్రీ పురుషుల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురయ్యేవారికి బీపీ, దాని కారణంగా హృద్రోగాలు వచ్చే ఛాన్సులు పెరుగుతాయట.

Tea-biscuit: ఉదయాన్నే టీ బిస్కెట్‌ తింటే రిస్క్ అని తెలుసా?

పురుషుల్లో హార్ట్ ఎటాక్ అవకాశాలు ఎక్కువగా ఉండటానికి జన్యుపరమైన కారణాలూ ఉన్నాయి. పురుషుల్లో కీలక అవయవాలు చుట్టూ కొవ్వు పేరుకునే అవకాశాలు అధికం. దీన్ని విసెరల్ ఫ్యాట్ అంటారు. చర్మం కింద పేరుకునే సబ్ క్యూటేనియస్ ఫ్యాట్ కంటే ఇది ప్రమాదకరం. దీనితో బీపీ, షుగర్, హృద్రోగాలతో పాటు ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. లాంన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, చిన్న వయసులో హార్ట్ ఎటాక్ బారిన పడే ఛాన్స్ పురుషుల్లో ఎక్కువట. తొలిసారి హార్ట్ ఎటాక్ గురైన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. దీనికి తోడు పురుషుల్లో ఎల్‌డీఎల్ అనే చెడు కొలెస్టెరాల్ సహజంగానే అధికంగా ఉంటుంది. ఇది కూడా రక్తనాళాలు పూడుకుపోయేందుకు కారణం అవుతుంది.

Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?

Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Read Health and Latest News

Updated Date - Sep 29 , 2024 | 03:26 PM