Health Tips: చలికాలంలో ఇలా చేస్తే దగ్గు, జలుబు పరార్..
ABN , Publish Date - Dec 02 , 2024 | 10:19 PM
Home Remedies for Cold and Caugh: మారుతున్న వాతావరణం కారణంగా ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ చలికాలంలో జలుబు, దగ్గు సమస్య అధికంగా ఉంటుంది. ఉదయం, రాత్రి చలి వాతావరణం..
Home Remedies for Cold and Caugh: మారుతున్న వాతావరణం కారణంగా ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ చలికాలంలో జలుబు, దగ్గు సమస్య అధికంగా ఉంటుంది. ఉదయం, రాత్రి చలి వాతావరణం.. మధ్యాహ్నం సమయంలో పొడి వాతావరణం కారణంగా.. కాలుష్యం పెరిగిపోతుంది. ఈ విచిత్ర వాతావరణ పరిస్థితుల కారణంగా.. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చలికాలంలో ప్రధానంగా వచ్చే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి పురాతన కాలం నుంచి వంటింటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా దగ్గు, జలుబు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మరి ఆ వంటింటి చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే..
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు లక్షణాలను తగ్గిస్తాయి. ఒక చెంచా తాజా అల్లం రసం తీసి అందులో తేనె కలపాలి. ఇది రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, శ్లేష్మం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆయుర్వేదంలో తులసి, లవంగాల వాడకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులు, లవంగాలను నీటిలో మరిగించి టీ తయారు చేసుకుని తాగాలి. రుచి కోసం కొంచెం తేనెను కూడా కలుపుకోవచ్చు. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆవిరి: ముక్కు దిబ్బడ, శ్లేష్మం సమస్యతో ఇబ్బందిపడేవారు.. ఆవిరి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్ నూనె వేసి.. ఆవిరి పట్టాలి. ఇది ముక్కు దిబ్బద, జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది.
పసుపు: పసుపులో క్రిమినాశక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది.
నీటితో పుక్కిలించాలి: గోరువెచ్చని నీటిలో కాసింత ఉప్పు వేసి కలిపి.. ఆ నీటితో పుక్కిలించాలి. తద్వారా గొంతు నొప్పి, ఇన్‌ఫెక్షన్ నుంచి బయటపడటానికి ఉపయోగకరంగా ఉంటుంది. వాపును కూడా తగ్గిస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు.. ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. వారి సలహాలను పాటించడం శ్రేయస్కరం.