Share News

Winter Tips: చలికాలంలో బొంతలు, దుప్పట్ల వాసన.. ఇలా చేస్తే మాయం..

ABN , Publish Date - Nov 09 , 2024 | 07:16 PM

చలికాలం మొదలైతే ఇంట్లో భద్రపరిచిన దుప్పట్లు, బొంతలు బయటకు తీస్తుంటాం. అయితే వీటి వాసన భరించడం కష్టం. ఈ వాసన సింపుల్ గా పోవాలంటే ఇలా చెయ్యాలి.

Winter Tips: చలికాలంలో బొంతలు, దుప్పట్ల వాసన.. ఇలా చేస్తే మాయం..
Winter Tips

చలికాలంలో బొంతలు, దుప్పట్ల వినియోగం మొదలవుతుంది. చలికాలం వచ్చే వరకు వీటిని భద్రంగా పెట్టేలలోనూ, అల్మారాలోనూ భద్రపరుస్తారు. నెలల తరబడి వీటిని అలా భద్రపరచడం వల్ల ఇవి బయటకు తీయగానే అదొకరకమైన వాసన వస్తుంటాయి. ఇలా వాసన వచ్చే దుప్పట్లను, బొంతలను వాడటం ఇబ్బందిగా ఉంటుంది. ఆ వాసనకు నిద్రకూడా పట్టదు. బరువైన దుప్పట్లు, బొంతలను వాష్ చేయడం అంత సులభం ఏమీ కాదు.. అయితే సింపుల్ గా ఈ వాసన పోవాలంటే కింద ఇచ్చిన చిట్కాలలో ఏదో ఒకటి వాడినా సరే ఫ్రెష్ గా ఉంటాయి.

Coper Bottles: రాగి వాటర్ బాటిల్స్ వాడుతుంటారా.. వాటిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..


బేకింగ్ సోడా..

దుప్పట్లు, బొంతలు వాసన వస్తుంటే సింపుల్ గా ఆ వాసన తొలకాలంటే బేకింగ్ సోడా బాగా సహాయపడుతుంది. దుప్పట్లను, బొంతలను నేల మీద పరిచి దాని మీద బేకింగ్ సోడా చల్లాలి. భద్రపరిచినప్పుడు దుప్పట్లలో, బొంతలలో పేరుకున్న దుమ్ము, తేమ అన్నింటిని బేకింగ్ సోడా పీల్చేస్తుంది. దీన్ని కొంతసేపు అలాగే ఉండనిచ్చి ఆ తరువాత బేకింగ్ సోడా విదిలించాలి. తరువాత పెద్ద కర్ర తీసుకుని దుప్పట్లు, బొంతలను కొట్టాలి. ఇలా చేస్తే బొంతల వాసన, వాటిలో దుమ్ము వదిలిపోతుంది.

కర్పూరం..

బొంతల నుండి వచ్చే వాసన వదలాలంటే కర్పూరం ఎఫెక్టీవ్ గా సహాయపడుతుంది. కర్పూరాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఒక కవర్ లో వేయాలి. ఈ కవర్ ను బొంత లేదా దుప్పటి మధ్యలో ఉంచాలి. ఇలా చేస్తే బొంత లేదా దుప్పటి వాసన పోతుంది. కర్పూరం వాసన వస్తుంది.

వైట్ వెనిగర్..

వంటలలో ఉపయోగించే వైట్ వెనిగర్ చాలా విధాలుగా సహాయపడుతుంది. ఇది బొంతలు, దుప్పట్ల నుండి వచ్చే ముతక వాసనను తొలగిస్తుంది. ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో వైట్ వెనిగర్ నింపాలి. దీన్ని బొంతల మీద దుప్పట్ల మీద చల్లాలి. తరువాత దుప్పట్లను, బొంతలను ఎండలో వేయాలి. కొంతసేపు ఇలాగే ఉంచితే చెడు వాసన మాయమవుతుంది.

Health Tips: బియ్యం కడిగిన నీటిని పడేస్తుంటారా.. వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చంటే..


రోజ్ వాటర్..

చర్మానికి ఎంతగానో సహాయపడే రోజ్ వాటర్ కూడా బొంతలు, దుప్పట్ల ముతక వాసనను తొలగిస్తుంది. దుప్పటి లేదా బొంతను మంచం లేదా నేల మీద పరిచి దాని చుట్టూ రోజ్ వాటర్ స్పే చేయాలి. కొద్దిసేపు ఫ్యాన్ ఆన్ లోనే ఉంచాలి. ఇలా చేస్తే కొద్దిసేపటిలోనే ముతక వాసన పోతుంది.

ఎసెన్షియల్ ఆయిల్స్..

ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా దుప్పట్లు, బొంతల వాసన పోగొట్టడంలో సహాయపడతాయి. కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను దుప్పటి మీద, బొంత మీద చల్లి కొద్ది సేపు గాలికి ఆరబెట్టాలి. చాలా తొందరగా ముతక వాసన వదిలిపోతుంది.

ఇవి కూడా చదవండి..

Custard Apple: సీతాఫలాల కాలం.. ఆరోగ్యానికి భలే లాభం..

Skin Care: మెరిసే చర్మం కోసం ఫేస్ క్రీములు అక్కర్లేదు.. నీళ్లు ఇలా తాగి చూడండి..

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 09 , 2024 | 07:16 PM