Share News

Women: ఆడవాళ్లు వేసుకునే గాజుల వెనుక ఇన్ని రహస్యాలున్నాయా? వైద్యులు చెబుతున్న నిజాలివీ..!

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:29 PM

మహిళలు గాజులు ధరించడం వెనుక, సాంప్రదాయం, మత విశ్వాసం కాదు.. ఈ షాకింగ్ విషయాలున్నాయి..

Women: ఆడవాళ్లు వేసుకునే గాజుల వెనుక ఇన్ని రహస్యాలున్నాయా? వైద్యులు చెబుతున్న నిజాలివీ..!

భారతీయ మహిళల అలంకారంలో గాజులు కూడా ఒక భాగం. వీటికి ఎంతో చరిత్ర ఉంది. బంగారం, వెండి, మట్టి.. ఇలా చాలా రకాలుగా స్థోమతను బట్టి, సందర్భాన్ని బట్టి ధరిస్తుంటారు. అయితే ఆడవాళ్ళు గాజులు ధరించడం వెనుక చాలా షాకింగ్ నిజాలున్నాయి. ఇవి కేవలం సాంప్రదాయం కోసమో, మత విశ్వాసం కోసమో కాదు. దీని వెనుక ఉన్న కారణాలను వైద్యులు కింది విధంగా చెప్పారు.

చాలావరకు చేతి నిండుగా గాజులు(Bangles) వేసుకున్న ఆడవారు వివాహితులు అనే విషయాన్ని సూచిస్తుంటాయి. కానీ ఇలా గాజులు ధరించడం వల్ల మణికట్టు మీద అవి ఘర్షణను సృష్టిస్తాయి. ఇది రక్తప్రసరణకు తోడ్పడుతుంది. వైద్యశాస్త్రం ప్రకారం చూస్తే మణికట్టు మహిళల శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు దోహపడే ప్రాంతం. ఇక్కడ కలిగే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తుంది. హార్మోన్లు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఇది ఆక్యుపంక్చర్ లా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

ఇది కూడా చదవండి: అల్పాహారంగా మొలకలు తింటే కలిగే షాకింగ్ ఫలితాలివీ..!


గాజులు వేసుకోవడంలోనే కాదు గాజుల ఎంపికలో కూడా చాలా రహస్యాలున్నాయి. చాలామంది గాజుతో తయారుచేసిన గాజులు ఎంచుకుంటారు. గాజు అనేది నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తుందని చెబుతారు. ఇంకొక కారణం ఏమిటంటే.. గాజు గాజుల ద్వారా వెలువడే శబ్దం శరీరంలో వైబ్రేషన్ కలిగిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది. పెళ్ళి కాని అమ్మాయిలు చాలావరకు కంకణాల లాంటి మందంపాటి గాజులు ధరిస్తారు. ఇవి గర్భాశయ దోషాలను సరిచేస్తాయని, నెలసరి సమస్యలలో మహిళలకు సహాయపడతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. గర్భవతులు కూడా చేతిలో గాజులు నిండుగా వేసుకోవాలని చెబుతుంటారు. ఇలా చేస్తే గర్భసమస్యలు ఏవీ రాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం. ఇకపోతే గాజుల రంగులు కూడా పలు ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఆకుపచ్చ గాజులు ధరిస్తే ప్రశాంతత లభిస్తుందట. అలాగే ఎరుపు రంగు గాజులు ధరిస్తే పిల్లలు కలగడంలో ఇబ్బందులు తొలగుతాయట.

ఇది కూడా చదవండి: Kids School Bag: పిల్లల స్కూల్ బ్యాగ్ ఏ వయసులో ఎంత బరువుండాలి? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?


(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 07 , 2024 | 12:29 PM