Share News

Women's Fitness: ఆడవాళ్ల ఫిట్నెస్ చెక్కుచెదరకూడదంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!

ABN , Publish Date - Apr 01 , 2024 | 03:56 PM

ఆడవారు తమ జీవితంలో ప్రతి దశలోనూ విభిన్న రకాల మార్పులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటి కారణంగా వారి ఫిట్నెస్ దెబ్బతింటుంది. అలా కాకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

Women's Fitness:  ఆడవాళ్ల ఫిట్నెస్ చెక్కుచెదరకూడదంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!

ఆడవారు తమ జీవితంలో ప్రతి దశలోనూ విభిన్న రకాల మార్పులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటి కారణంగా వారి ఫిట్నెస్ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇప్పట్లో అమ్మాయిలు ఒకవైపు ఇంటి పనులు చేసుకుంటూ మరొకవైపు ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. దీనివల్ల తొందరగా అలసిపోతారు. మగవారితో పోలిస్తే అమ్మాయిలలో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలన్నా, మహిళలు తమ ఫిట్నెస్ విషయంలో ఎలాంటి చీకు చింతా ఎదుర్కోకూడదన్నా వారి శరీరం గురించి వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తమ ఫిట్నెస్ ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి.

శారీరక వ్యాయామం..

మహిళలు శారీరక వ్యాయామం ప్రాముఖ్యత తెలుసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల శారీరక సామర్థ్యం పెరుగుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది, మంచి నిద్ర వస్తుంది. మహిళల హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో చాలా సహాయపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. రోజువారీ జీవితంలో యోగా, నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి సాధారణ వ్యాయామాలను చేర్చుకోవాలి.

ఇది కూడా చదవండి: Basmati Rice: సాధారణ బియ్యం కంటే బాస్మతి రైస్ ఆరోగ్యానికి మంచిదా? దీని గురించి ఆహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..!



నిద్ర..

మహిళలు ఫిట్నెస్ గా ఉండాలంటే.. మంచి నిద్ర కూడా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని కూడా పెంచుతుంది. మహిళలకు 7-9 గంటల నిద్ర అవసరం. నిద్ర నాణ్యతను పెంచడానికి, రాత్రి వేళల్లోదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం, మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ వాడకాన్ని తగ్గించడం వంటి కొన్ని సాధారణ చిట్కాలను ప్రయత్నించవచ్చు.

ఆహారం..

మహిళలు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన పోషకాహారం శక్తిని ఇస్తుంది. వారి శారీరక సామర్థ్యాలను కాపాడటానికి సహాయపడుతుంది. ఆహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ఆకు కూరలు ఉండాలి.

పరిశుభ్రత..

శారీరక ఆరోగ్యం సమతుల్యంగా ఉండాలంటే పరిశుభ్రతను పాటించడం ముఖ్యం. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో యువతులు తమ పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్యాడ్‌లను క్రమం తప్పకుండా మార్చాలి. బిగుతుగా ఉండే బట్టలు ధరించకూడదు. సాధారణ వేడి నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 03:56 PM