Share News

Women's Health: ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. మహిళలలో గుండె జబ్బుల ప్రమాదం చాలా తగ్గినట్టే..!

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:14 PM

5 టిప్స్ ఫాలో అయితే మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం తగ్గించవచ్చట.

Women's Health: ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. మహిళలలో గుండె జబ్బుల ప్రమాదం చాలా తగ్గినట్టే..!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే మహిళలు కుటుంబాన్ని చూసుకుంటూ తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. అందుకే మహిళలలో ఆరోగ్య సమస్యలు ఏవైనా చివరి స్టేజ్ లో బయటపడి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి. ఇక ఇప్పుట్లో అన్ని వయసుల వారు ఎదుర్కొంటున్న గుండె జబ్బులు కూడా మహిళలలో ఉన్నాయి. అయితే 5 టిప్స్ ఫాలో అయితే మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం తగ్గించవచ్చట. అవేంటో తెలుసుకుంటే..

సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి గుండెకు మేలుచేసే ఆహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి. సంతృప్త, ట్రాన్స్ కొవ్వులను పరిమితం చేయాలి. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించడం, మొత్తం హృదయ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఆహారపు అలవాట్లలో చిన్న, స్థిరమైన మార్పులు కాలక్రమేణా గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తాయి.

ఇది కూడా చదవండి: ఈ 8 కొరియన్ డ్రింక్స్ ఎంత పవరంటే.. బరువును ఐస్ లా కరిగిస్తాయ్..!


గుండె జబ్బుల నివారణలో శారీరక శ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం బరువును బాలెన్స్ గా ఉంచడానికి మాత్రమే కాకుండా గుండె కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాలు తేలిక నుండి తీవ్రతమైన వ్యాయామం చెయ్యాలి. ఇందులో చురుకైన నడక, సైక్లింగ్ లేదా డ్యాన్స్ వంటివి భాగం చేసుకోవచ్చు.

ఒత్తిడి నిర్వహించడంలో మహిళలు ఫెయిల్ అవుతుంటారు. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే జీవనశైలిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది.

కుటుంబ చరిత్రలో గుండెపోటు సమస్యలు ఉంటే రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అదేవిధంగా రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సమస్యలను ప్రభావితం చేసే ఇతర సమస్యలు ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకోవాలి.

మహిళలలో కూడా కొందరు ధూమపానం, మద్యపానం, హానికరమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఆరోగ్యవిషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా గుండె జబ్బులను పెంచే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటిని నివారించుకుంటే గుండె జబ్బులను దూరంగా ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Star Anise: వంటల్లో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?


మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 05:14 PM