World Malaria Day: మలేరియా వ్యాధిని లైట్ తీసకోకండి.. ఇది వ్యాపించకుండా ఏం చేయాలంటే..!
ABN , Publish Date - Apr 24 , 2024 | 02:28 PM
మలేరియా అనేది కొన్ని రకాల దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి. ఇది ఉష్ణమండల దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ పరాన్నజీవుల వల్ల వస్తుంది. అయితే అంటువ్యాధి కాదు.
మలేరియా అనేది దోమల వల్ల కలిగే ప్రమాదకరమైన వ్యాధి. ఇది తీవ్రమైతే మరణానికి కూడా కారణమవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. సమయానికి చికిత్స చేస్తే తగ్గిపోతుంది కూడా. దీని గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 న మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మలేరియాతో పాటు డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులకు దోమలే కారణం. మలేరియా వ్యాప్తిని ఎలా అరికట్టాలో.. వైద్యులు ఇచ్చిన సలహాలేంటో తెలుసుకుంటే..
మలేరియా అనేది కొన్ని రకాల దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి. ఇది ఉష్ణమండల దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ పరాన్నజీవుల వల్ల వస్తుంది. అయితే అంటువ్యాధి కాదు.
పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని పండ్లు ఇవీ..!
మలేరియా లక్షణాలు..
జ్వరం, తలనొప్పి, చలి దీని ప్రధాన లక్షణాలు. సాధారణంగా దోమ కుట్టిన 10-15 రోజులలోపు ఇవి ప్రారంభమవుతాయి. వీటితో పాటూ విపరీతమైన అలసట, మూర్ఛపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. మూత్రం రంగు చాలా డార్క్ కలర్ లో ఉండటం లేదా మూత్రంలో రక్తం పడటం. కామెర్లు,
అసాధారణ రక్తస్రావం మొదలైన ఇతర లక్షణాలు కూడా ఉంటాయి.
మలేరియా నివారణ మార్గాలు..
=> దోమలు కుట్టకుండా ఉండేందుకు పొడవాటి స్లీవ్‌లు, పొడవాటి ప్యాంటు, సాక్స్‌లను ఉపయోగించాలి. తెల్లవారుజాము, సాంయంత్రం సమయాల్లో దోమలు చాలా చురుకుగా ఉంటాయి కాబట్టి ఈ సమయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇది కాకుండా దోమలు ముదురు రంగుల వైపు ఆకర్షితులవుతాయి. కాబట్టి లేత రంగులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని పండ్లు ఇవీ..!
=> నిద్రిస్తున్నప్పుడు దోమ తెరలను ఉపయోగించడం.
=> దోమలు వృద్ధి చెందకుండా నిరోధించడానికి ఇంటి చుట్టూ కంటైనర్లలో నిల్వ చేసిన నీటిని ఖాళీ చేయాలి.
=> ఇప్పటికే మలేరియా వ్యాప్తి బలంగా ఉన్న ప్రదేశంలో నివసిస్తుంటే దోమలను నిర్మూలనకు రసాయనాలు ఉపయోగించాలి.
=> జ్వరం, తలనొప్పి, చలి, వాంతులు వంటి మలేరియా లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
=> రోజూ సన్‌స్క్రీన్ అప్లై చేయడం, క్రమం తప్పకుండా స్నానం చేయడం ముఖ్యం. ఇళ్లు, కార్యాలయాల్లోని గదులను ఎయిర్ కండిషన్‌లో ఉంచాలి.
=> ఆరుబయట లేదా ఎక్కడైనా బహిరంగంగా నిద్రిస్తున్నట్లయితే. పడుకునేటప్పుడు దోమతెరను ఉపయోగించాలి.
=> ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ప్రయాణించడం, లేదా బస చేయడం మానుకోండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని పండ్లు ఇవీ..!
Digestive problems: వేసవిలో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించేయండి!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.