Share News

World Stroke Day: స్ట్రోక్ ప్రమాదం తగ్గాలంటే.. ఇలా చేయండి..!

ABN , Publish Date - Oct 29 , 2024 | 09:41 AM

నేటి కాలంలో ప్రపంచంలో సంభవిస్తున్న మరణాలకు స్ట్రోక్ రెండవ అతిపెద్ద కారణంగా ఉంది.

World Stroke Day: స్ట్రోక్ ప్రమాదం తగ్గాలంటే.. ఇలా చేయండి..!
World Stroke Day

స్ట్రోక్ ఈ మధ్య కాలంలో చాలా మంది మరణాలకు కారణం అవుతున్న సమస్య. భారతదేశంలో అత్యధికంగా సంభవిస్తున్న మరణాలకు రెండవ అతిపెద్ద కారణం ఇది. స్ట్రోక్ అనేది అకస్మాత్తుగా ఏర్పడే సమస్య. ధమనులు రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం లేదా మెదడు నాళాలు చీలికలు ఏర్పడి రక్తస్రావం జరగడం వంటివి స్ట్రోక్ కు కారణం అవుతాయి. కొన్ని సందర్భాలలో స్ట్రోక్ అనేది మరణానికి కూడా దారితీస్తుంది. చాలా వరకు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు, జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నప్పుడు, వ్యాయామం, డాన్స్, తీవ్రమైన ఎమోషన్స్ లో ఉన్నప్పుడు ఇలా.. చాలా సందర్బాలలో స్ట్రోక్ లు సంభవిస్తున్నాయి.

తేనె గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఇవీ..


ప్రతి ఏడాది అక్టోబర్ 29వ తేదీని ప్రపంచ స్ట్రోక్ డే గా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రజలలో స్ట్రోక్ నివారణ గురించి పలు మార్గాలలో అవగాహన చర్యలు చేపడుతున్నారు.

స్ట్రోక్ కు కారణాలు..

భారతదేశంలో రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఊబకాయం వంటి సాధారణ సమస్యలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇవి సెరెబ్రోవాస్కులర్ వ్యాధులకు సంబంధించినవి. నిశ్చలంగా ఉన్న జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడులు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రజలలోనూ, వారి కుటుంబాలలోనూ స్ట్రోక్ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

Health Tips: దీపావళికి ముందు అనారోగ్యం చేయకూడదంటే ఇలా ఇమ్యునిటీ పెంచుకోండి..!


స్ట్రోక్ రాకూడదంటే..

స్ట్రోక్ అనేది ఊహించని విధంగా ఎదురయ్యే సమస్య. దీని ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, రక్తపోటు, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ వంటివి నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంలో స్ట్రోక్, గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారు ఉంటే ఆ కుటుంబ సభ్యులు కూడా చెకప్ లు చేయించుకుంటూ ఉండటం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి..

ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!

బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 29 , 2024 | 09:41 AM