Share News

Yoga: ఈ రెండు ఆసనాలు వేస్తుంటే చాలు.. రోజంతా యమా ఎనర్జీగా ఉండొచ్చు..!

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:42 PM

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఉరుకులు పరుగులతో రోజు గడుస్తుంది. ఇంటి పనులు, ఉద్యోగాలు, పిల్లల సంరక్షణ, ఇతర కార్యకలాపాలు.. ఇలా ప్రతి పనిని చక్కబెట్టడానికి శరీరంలో తగినంత శక్తి అవసరం. కానీ కొందరికి రోజంతా ఎనర్జీతో ఉత్సాహంగా ఉండటం సాధ్యం కాదు.

Yoga:  ఈ రెండు ఆసనాలు వేస్తుంటే చాలు.. రోజంతా యమా ఎనర్జీగా  ఉండొచ్చు..!

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఉరుకులు పరుగులతో రోజు గడుస్తుంది. ఇంటి పనులు, ఉద్యోగాలు, పిల్లల సంరక్షణ, ఇతర కార్యకలాపాలు.. ఇలా ప్రతి పనిని చక్కబెట్టడానికి శరీరంలో తగినంత శక్తి అవసరం. కానీ కొందరికి రోజంతా ఎనర్జీతో ఉత్సాహంగా ఉండటం సాధ్యం కాదు. దీన్ని అధిగమించి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే కేవలం రెండు ఆసనాలు వేస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుంటే..

భుజంగాసనం..

భుజంగాసనం ఉదర కండరాలను టోన్ చేయడంలో సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, వెన్నును, భుజాలను బలపరుస్తుంది. వెన్నెముక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, అలసటను తొలగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!


ఎలా వేయాలంటే..

మెత్తని వస్ర్తం లేదా యోగా మ్యాట్ పరుచుకుని దానిమీద బోర్లా పడుకోవాలి.

రెండు అరచేతులను నేలపై ఉంచాలి. భుజాలను వెడల్పుగా ఉంచాలి.

శరీరం కింద భాగాన్ని నేల పైనే ఉంచి శ్వాస తీసుకుంటూ మెల్లిగా అరచేతుల మీద ఒత్తిడి తీసుకుని రావాలి.

తల, మెడ, ఛాతీ భాగాన్ని మెల్లగా పైకి లేపాలి.

కొన్ని సెకెండ్ల పాటూ ఇదే భంగిమలో ఉండి ఆ తరువాత తిరిగి సాధారణ స్థితికి రావాలి.

కపాలభాతి..

కపాలభాతి చేయడం వల్ల కండరాలు, అబ్స్ బలంగా మారుతాయి. అంతేకాకుండా పొట్ట కొవ్వు కూడా తగ్గుతుంది. రోజూ కపాలభాతి వేస్తుంటే శ్వాసకోశ వ్యవస్థ బలపడుతుంది. ఇది నరాలను బలపరుస్తుంది. అంతే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. కపాలభాతి చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరగవుతుంది. అలాగే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండచ్చు.

30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!

రాత్రి 7గంటలలోపు డిన్నర్ ఎందుకు చేయాలో చెప్పే బలమైన కారణాలివీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 30 , 2024 | 01:42 PM