Turtle Meat: రుచికరంగా ఉందని తాబేలు మాంసం తిన్నారు.. తీరా చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
ABN , Publish Date - Mar 10 , 2024 | 07:20 PM
కొన్ని ఆహారాలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో, ఆరోగ్యానికి అంతే హానికరం కూడా! కాబట్టి.. ఏదైనా తినేముందు అది ఆరోగ్యానికి మంచిదేనా? కాదా? అనేది నిర్ధారించుకోవాలి. కాదు, కూడదు అనే నచ్చింది తింటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా నెలకొనవచ్చు. తాజాగా ఇలాంటి విషాదకరమైన ఘటన ఒకటి వెలుగు చూసింది.
కొన్ని ఆహారాలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో, ఆరోగ్యానికి అంతే హానికరం కూడా! కాబట్టి.. ఏదైనా తినేముందు అది ఆరోగ్యానికి మంచిదేనా? కాదా? అనేది నిర్ధారించుకోవాలి. కాదు, కూడదు అనే నచ్చింది తింటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా నెలకొనవచ్చు. తాజాగా ఇలాంటి విషాదకరమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. తాబేలు మాంసం (Turtle Meat) తిని.. ఏకంగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆఫ్రికన్ దేశం టాంజానియాకు (Tanzania) సమీపంలోని జాంజిబార్ (Zanzibar) దీవుల్లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
జాంజిబార్ ద్వీపసమూహంలో నివసించే ప్రజలు సముద్ర తాబేలు మాంసాన్ని ఎంతో రుచికరమైనదిగా పరిగణిస్తారు. కానీ.. ఇది ఎంతో ప్రమాదకరమైనది. ఈ మాంసాన్ని తింటే.. క్రమంగా కెలోనిటాక్సిజం(Chelonitoxism)కి (ఇది ఒక రకమైన ఫుడ్ పాయిజన్) దారితీస్తుంది. ఫలితంగా.. మరణాలు సంభవిస్తాయి. అయినా లెక్క చేయకుండా.. అక్కడి ప్రజలు ఈ సముద్ర తాబేలు మాంసాన్ని బాగా తింటారు. పెంబా ద్వీపంలో (Pemba Island) నివసించే కొందరు ప్రజలు కూడా ఇటీవల ఈ మాంసాన్ని తిన్నారు. దీంతో.. ఎనిమిది పిల్లలతో పాటు ఒక మహిళ మరణించారు. అలాగే.. 78 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీళ్లందరినీ ఆసుపత్రిలో చేర్పించి, తగిన చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై మకోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హాజీ బకారి మాట్లాడుతూ.. విషపూరితమైన ఆహారం తినడం వల్లే వీళ్లు మృతి చెందారని, 78 మంది అనారోగ్యంపాలై చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీళ్లందరూ సముద్ర తాబేలు మాంసం తిన్నారని లేబొరేటరీ పరీక్షల్లో నిర్ధారితం అయ్యిందన్నారు. మరోవైపు.. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి విపత్తు నిర్వహణ బృందాన్ని ఉన్నతాధికారులు పంపించారు. సముద్ర తాబేలు మాంసం చాలా ప్రమాదకరమైనదని, దీనిని తినొద్దని అక్కడి ప్రభుత్వం ప్రజల్ని సూచించింది కూడా! కాగా.. 2021 నవంబర్‌లోనూ తాబేలు మాంసం తిని.. మూడేళ్ల చిన్నారితో పాటు ఏడుగురు మరణించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి