Share News

Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు

ABN , Publish Date - May 12 , 2024 | 06:43 PM

భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.

 Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు

కాబూల్, మే 12: భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది ప్రజలు గల్లంతయ్యారని చెప్పాయి.

LokSabha Elections: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు ప్రకటించిన కేజ్రీవాల్

దేశంలోని వివిధ ప్రావిన్స్‌ల్లోని గ్రామాలు, వ్యవసాయ భూముల్లోకి భారీగా ముట్టి వచ్చి చేరిందని అధికార వర్గాలు వివరించాయి. అలాగే ఈ వరదల దాటికి ఆరోగ్య రంగానికి చెందిన మౌలిక సదుపాయాలన్నీ పూర్తిగా నాశనమయ్యాయని పేర్కొన్నాయి. వేలాది ఇళ్లతోపాటు నిల్వ చేసుకున్న ఆహార పదార్ధాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయని తెలిపాయి.

Congress Party: ఖర్గే హెలికాఫ్టర్‌లో తనిఖీలు..

మరోవైపు ఈ వరదల కారణంగా బఘ్లాన్ ప్రావిన్స్‌‌కు తీవ్ర నష్టం కలిగిందన్నాయి. ఈ బక్క ప్రావిన్స్‌లోనే 300 మంది మరణించారని.. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నాయి. ఇంకోవైపు దేశంలోని వరద విపత్తుపై అఫ్గాన్‌ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ వర్షాలు, వరదల వల్ల 311 మంది మరణించారని.. అలాగే 2,011 ఇళ్లు కూలి పోయాయని.. 2,800 నివాసాలు దెబ్బ తిన్నాయని వివరించింది.

Mothers Day: అమ్మ పాత్ర ఎప్పటికీ నిత్య నూతనమే

మరోవైపు తమకు ఆహారం లేదు, తాగటానికి నీరు లేదు, ఆశ్రయం లేకుండా పోయింది, కప్పుకోవడానికి దుపట్లు లేవు. ఈ వరదల కారణంగా అన్ని నాశనమైనాయని వరద బాధితుడు, స్థానికుడు మహమ్మద్ యాకుబ్ వెల్లడించారు. ఈ వర్షాలు, వరదలతో తన 13 మంది కుటుంబ సభ్యులను కొల్పోయానని చెప్పారు.

Bomb scare in Delhi: ఈ సారి ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

ఇంకో వైపు అఫ్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఘనీ స్పందించారు. ఈ భారీ వర్షాలు, వరదలకు చాలా మంది ప్రజలు గల్లంతయ్యారన్నారు. ఇక అఫ్గాన్‌లో వరద బీభత్సం సృష్టించిందని.. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితితోపాటు వివిధ సంస్థలు మానవత్వంతో సహయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని తాలిబన్ ఆర్థిక మంత్రి దిన్ మహ్మద్ హనీఫ్ ఆ యా సంస్థలకు విజ్జప్తి చేశారు.

LokSabha Elections: రేపే నాలుగో దశ పోలింగ్..

Read Latest National News And Telugu News

Updated Date - May 12 , 2024 | 06:43 PM