Share News

Air Canada: విమానం గాల్లో ఎగిరిన క్షణాల్లోనే మంటలు.. ఆ తర్వాత ఏమైందంటే?

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:18 PM

ఒక విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు.. దానిని పూర్తిగా తనఖీ చేస్తారు. గాల్లో ఎగిరిన తర్వాత అనివార్య ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు.. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరెన్నో జాగ్రత్తలూ...

Air Canada: విమానం గాల్లో ఎగిరిన క్షణాల్లోనే మంటలు.. ఆ తర్వాత ఏమైందంటే?
Air Canada Boeing Catches Fire Moments After Takeoff

ఒక విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు.. దానిని పూర్తిగా తనఖీ చేస్తారు. గాల్లో ఎగిరిన తర్వాత అనివార్య ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు.. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరెన్నో జాగ్రత్తలూ పాటిస్తారు. అయినప్పటికీ.. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. అప్పుడు పైలట్‌లు చాకచక్యంగా వ్యవహరించి.. విమానాలను సేఫ్‌గా ల్యాండ్ చేస్తారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కెనడాలో (Canada) వెలుగు చూసింది. పైలట్‌లు ఎంతో తెలివిగా వ్యవహరించడం వల్ల.. ఓ బోయింగ్ విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


Read Also: దేశ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్?

జూన్ 5వ తేదీన ఎయిర్ కెనడాకు (AIr Canada) చెందిన బోయింగ్‌ ఏసీ 872 విమానం.. టొరంటో పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.46 గంటలకు బయలుదేరింది. అందులో 400 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఉన్నారు. అయితే.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానంలోని కుడివైపు ఇంజిన్‌లో చిన్న పేలుడు సంభవించింది. దీంతో.. విమానం రెక్కల వద్ద మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన పైలట్‌లు.. ఏమాత్రం తొందరపడకుండా చాకచక్యంగా వ్యవహరించారు. 30 నిమిషాల్లోనే ఆ విమానాన్ని తిరిగి అదే ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. దీంతో.. భారీ ప్రమాదం తప్పి, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.


Read Also: మోదీ గెలుపుపై పాక్ షాకింగ్ కామెంట్స్

ఈ ఘటనపై ఎయిర్ కెనడా స్పందిస్తూ.. విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను కిందకు దించేసి, మరో విమానంలో పంపించామని తెలిపింది. మరోవైపు.. ఇంజిన్ కంప్రెసర్ సమస్య వల్లే మంటలు చెలరేగాయని ఎయిర్ కెనడా ప్రతినిధి వివరణ ఇచ్చారు. సమస్యని పూర్తిగా పరిష్కరించాకే విమానాన్ని తిరిగి సేవల కోసం వినియోగించడం జరుగుతుందని తెలిపారు. కాగా.. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. అటు.. వాతావరణం కూడా అనుకూలంగా లేదు. అయినప్పటికీ.. పైలట్‌లు ఎంతో తెలివి ప్రదర్శించి, విమానాన్ని తిరిగి సురక్షితంగా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయడంతో వారిని అభినందిస్తున్నారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 06:07 PM