Share News

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింత ప్రవర్తన.. స్టేజ్‌పై బిగుసుకుపోయి..

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:24 PM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. గందరగోళంగా చూపులు చూడటం, వేదికపై మాట్లాడుతున్నప్పుడు బిగుసుకుపోవడం.. వంటి ఉదంతాలు..

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింత ప్రవర్తన.. స్టేజ్‌పై బిగుసుకుపోయి..
America President Joe Biden Freezes On Stage

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. గందరగోళంగా చూపులు చూడటం, వేదికపై మాట్లాడుతున్నప్పుడు బిగుసుకుపోవడం.. వంటి ఉదంతాలు ఇప్పటివరకూ ఎన్నో జరిగాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ వేదికపై అభివాదం చేస్తూ ఆయన ఒక్కసారిగా బొమ్మలా ఆగిపోయారు. అప్పుడు అక్కడే ఉన్నన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) ఆయనకు సహాయం చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..


Read Also: 48 గంటల్లో మరణమే.. జపాన్‌లో వ్యాపిస్తున్న అరుదైన వ్యాధి

డెమోక్రాటిక్‌ పార్టీ (Democratic Party) శనివారం లాస్ ఏంజెల్స్‌లో (Los Angels) విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో జో బైడెన్, బరాక్ ఒబామా కలిసి పాల్గొనగా.. ఆ ఇద్దరితో జిమ్మీ కిమ్మెల్‌ (Jimmy Kimmel) ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ ముగిసి తర్వాత ఆ కార్యక్రమానికి విచ్చేసిన జనాలందరూ కరతాళ ధ్వనులతో మార్మోగించారు. దీంతో.. బైడెన్, ఒబామా ఇద్దరూ వారికి అభివాదం చేశారు. అప్పుడే అసలైన కథ ప్రారంభమైంది. ఒబామా అభివాదం చేస్తూనే వేదిక దిగేందుకు సిద్ధమవుతుండగా.. బైడెన్ మాత్రం చిరునవ్వు చిందిస్తూనే పది సెకన్ల పాటు బిగుసుకుపోయారు. ఒక బొమ్మలాగా అక్కడే నిలబడి ఉండిపోయారు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్ చేయి పట్టుకున్నారు. అప్పుడు బైడెన్ వెంటనే తేరుకొని ముందుకు నడిచారు. ‘మరేం పర్వాలేదన్నట్టుగా భుజం తడుతూ.. బైడెన్‌ను ఒబామా అక్కడి నుంచి తీసుకెళ్లారు.


Read Also: మారిన కెనడా ప్రధాని స్వరం.. ఇకపై భారత్‌తో కలిసి..

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. బైడెన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది పదుల వయసు దాటింది కాబట్టే.. ఆరోగ్య రీత్యా ఆయన ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని కామెంట్లు పెడుతున్నారు. అయితే.. ఆయన సతీమణి మాత్రం తన భర్త సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ ఆయన ఆరోగ్యంగానే ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి, ఇందుకు ఆమె ఎలా బదులిస్తుందో చూడాలి.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 03:25 PM