Syria: సిరియా అధ్యక్షుడి విమానం మిస్సింగ్.. అసద్ పాలన అంతమేనా
ABN , Publish Date - Dec 08 , 2024 | 10:55 AM
సిరియా రాజధాని డమాస్కస్‌పై రెబల్ గ్రూప్ తమ నియంత్రణను ప్రకటించింది. అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ సిరియా నుంచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన రష్యా లేదా టెహ్రాన్‌కు వెళ్లారనే చర్చ జరుగుతోంది.
సిరియా(Syria)లో అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ (Bashar al-Assad) పాలన ముగిసిందని తిరుగుబాటు గ్రూపు తెలిపింది. తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వేరే ప్రాంతానికి పారిపోయారని వార్తా సంస్థ రాయిటర్స్ నుంచి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అసద్ రష్యా లేదా టెహ్రాన్ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అస్సాద్ సిరియా నుంచి రష్యా కార్గో విమానంలో బయలుదేరారని, రాడార్ నుంచి తప్పిపోయిందని చెబుతున్నారు.
రెబల్ గ్రూప్ విజ్ఞప్తి
అదే సమయంలో సిరియా ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ తన ఇంటి నుంచి ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. తాను దేశంలోనే ఉంటానని, అధికారాన్ని సజావుగా బదిలీ చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. రెబల్ గ్రూప్ సిరియాలో ఆక్రమణను ప్రకటించింది. ఈ క్రమంలో అసద్ సోదరుడు మహర్ అల్-అస్సాద్ కూడా పారిపోయాడు. రాజధాని డమాస్కస్‌లోకి తిరుగుబాటుదారులు నలువైపుల నుంచి ప్రవేశించారు. రాష్ట్రపతి భవన్ దగ్గర భీకర పోరు కనిపిస్తోంది. డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు.
అనేక నగరాలు స్వాధీనం
ప్రస్తుతం రెబల్ గ్రూప్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ తిరుగుబాటు గ్రూపులకు అమెరికా, ఇరాన్‌ల మద్దతు ఉందని అంటున్నారు. అసద్ పాలన ముగిసిందని రెబల్ గ్రూపులు అధికారిక ప్రకటనలో తెలిపాయి. వారు దేశం విడిచి పారిపోయారని, సిరియా ప్రజలు ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై సిరియాపై ఎవరూ ఆధిపత్యం చెలాయించబోరని అన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌తో సహా అనేక పెద్ద నగరాలు ఈ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. అసద్ దళాలు డమాస్కస్ నుంచి పారిపోయాయని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దేశం నుంచి పారిపోయిన తర్వాత, ఆయన దళాలు తిరుగుబాటుదారుల దాడులకు భయపడుతున్నాయి.
ఖైదీల విడుదల
మరోవైపు సిరియా సైనికులు తమ యూనిఫాంలను తీసివేసారు. భయంతో వారు తమ యూనిఫాంలను వదిలి సాధారణ దుస్తులు ధరించారు. డమాస్కస్‌లోని అల్-మజేహ్‌లో యూనిఫాంలు విప్పిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. డమాస్కస్‌లో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. అసద్ సేనలు డౌమాలో ఇద్దరు నిరసనకారులను హతమార్చాయి. తిరుగుబాటుదారుల ఆక్రమణల మధ్య, అస్సాద్ సైనికులు వారి సొంత ఆయుధాల డిపోను కూడా పేల్చివేశారు. ఆ క్రమంలో తిరుగుబాటుదారులు సెడ్నాయ జైలు నుంచి ఖైదీలను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More International News and Latest Telugu News