Share News

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

ABN , Publish Date - Dec 22 , 2024 | 07:41 AM

వేగంగా ప్రయాణిస్తున్న బస్సు టైరు ఊడిపోయింది. దీంతో ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

బ్రెజిల్, డిసెంబర్ 22: బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినాస్‌గెరైస్ నగరంలోని జాతీయ రహదారిపై ట్రక్కును వేగం వెళ్లుతోన్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. వేగంగా వెళ్తున్న సమయంలో.. బస్సు ట్రైరు ఊడిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి.. ట్రక్కును ఢీకొంది. దాంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 38 మంది మరణించారు.


ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ ప్రమాద సమయలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


మరోవైపు ఈ ప్రమాద సమయంలో.. అటుగా వస్తున్న కారు సైతం ఈ బస్సును ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. కానీ ఎటువంటి గాయాలు మాత్రం కాలేదని పోలీసులు వివరించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు టైరు ఊడిపోవడంతో.. డ్రైవరు వాహనంపై నియంత్రణ కోల్పోయాడని.. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

For International News And Telugu News

Updated Date - Dec 22 , 2024 | 08:29 AM