Home » Brazil
వేగంగా ప్రయాణిస్తున్న బస్సు టైరు ఊడిపోయింది. దీంతో ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అదృష్టం కొద్దీ లాటరీ రూపంలో డబ్బు వస్తే ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. బ్రెజిల్‌కు చెందిన ఓ రైతుకు అలాంటి అవకాశమే వచ్చింది. ఏకంగా రూ.283 కోట్ల రూపాయల లాటరీని గెలుచుకున్నాడు. ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. కట్ చేస్తే..
నైజీరియాలో తొలి పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (నవంబర్ 18న) బ్రెజిల్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ జరిగే జీ-20 సదస్సులో పాల్గొననున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెండు కోతులు ఆహార పదార్థాల కోసం వెతుకుతూ రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండీ పైకి ఎక్కుతాయి. వాటిలో ఓ కోతి చెత్త కుండీలో వెతకగా.. అందులో..
బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది.
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్‌కి బ్రెజిల్ పెద్ద దెబ్బ వేసింది. బ్రెజిలియన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రతినిధిని నియమించనందుకు దేశంలో X సేవలను సస్పెండ్ చేశారు. అంతేకాదు ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానా కూడా విధిస్తామన్నారు.
భారత్, నేపాల్, వియత్నాం దేశాలకు చెందిన వందలాది మంది వలసదారులు బ్రెజిల్లో సావోపాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 62 మందితో వెళ్తున్న వోపాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎటీఆర్-72 విమానం శుక్రవారం మధ్యాహ్నం సావోపౌలో రాష్ట్రంలోని విన్హెడో అనే ప్రాంతంలో కుప్పకూలింది.
బ్రెజిల్(brazil) దేశంలో గత కొన్ని గంటలుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల(rains) కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 39కి చేరుకోగా, మరో 60 మంది గల్లంతయ్యారు. కుండపోత వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది.
ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృత్యువాత చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్(brazil) పోర్టో అలెగ్రే(Porto Alegre) నగరం గరోవా ఫ్లోరెస్టా హోటల్లోని మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది.