Share News

Australia: స్టూడెంట్ వీసా ఛార్జీలు భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:53 PM

తమ దేశంలో వలసలను నిరోధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందా? అంటే తాజాగా అంథోనీ అల్బనీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అలాగే భావించాల్సి వస్తుంది.

Australia: స్టూడెంట్ వీసా ఛార్జీలు భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

మెల్‌బోర్న్, జులై 01: తమ దేశంలో వలసలను నిరోధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందా? అంటే తాజాగా అంథోనీ అల్బనీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అలాగే భావించాల్సి వస్తుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు జారీ చేసే స్టూడెంట్ వీసా ఫీజును ఆ ప్రభుత్వం భారీగా పెంచింది. అదికూడా ఎంతగా అంటే.. దాదాపుగా రెట్టింపు స్థాయిలో పెంచింది.

రూ.710 ఆస్ట్రేలియా డాలర్లు ఉన్న ప్రస్తుత స్టూడెంట్ వీసా ఫీజును రూ.1600 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచింది. ఇది జులై 1వ తేదీ నుంచి అంటే.. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం పడనుంది.

Also Read: INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన


ఈ వీసా పెంపు నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి రావడం వల్ల తమ అంతర్జాతీయ విద్యా విధానం తాలుకు సమైక్యతను పునరుద్దరించేందుకు సహయకారిగా అవుతుందని ఆ దేశ సైబర్ సెక్యూరిటీ, హోమ్ ఎఫైర్స్ మంత్రి క్లెర్ ఓ నీల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు 2023, సెప్టెంబర్ 30వ తేదీ వరకు 548,800 మంది విదేశీ విద్యార్థులు ఈ వీసా తీసుకున్నారని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటస్‌స్టిక్స్ స్పష్టం చేసింది. ఇంకోవైపు ఉన్నత విద్యా కోసం ఆస్ట్రేలియానే కాకుండా.. యూఎస్, కెనడా దేశాలకు సైతం విద్యార్థులు తరలి వెళ్తున్నారు. అయితే ఈ రెండు దేశాలకు మించి స్టూడెంట్ వీసా ఛార్జీలను ఆస్ట్రేలియా ప్రభుత్వం పెంచడం గమనార్హం.

Also Read: Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్

అయితే ఆస్ట్రేలియా జారీ చేస్తున్న స్టూడెంట్ వీసాల్లోని పలు లోపాలుంటున్నాయి. వీటిని విదేశీ విద్యార్థులు ఆసరాగా చేసుకోంటున్నారు. ఆ క్రమంలో తమ వీసాల గడువును పలుమార్లు పొడిగించుకుంటున్నారు. దీంతో వారంతా ఆస్ట్రేలియాలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ తరహా చర్యలు తీసుకుందని తెలుస్తుంది. ఇక స్టూడెంట్ వీసాల పొదుపు నిబంధనలో సైతం ఆస్ట్రేలియా ప్రభుత్వం పలు మార్పులు చేసింది.

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 04:53 PM