Share News

Viral News: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్ట్‌లోకి బ్యాటరీలు.. ఆ తర్వాత ఏమైందంటే?

ABN , Publish Date - Feb 17 , 2024 | 06:51 PM

తమ సంతృప్తి కోసం కొందరు వ్యక్తులు విచిత్రమైన పనులకు పాల్పడుతుంటారు. భాగస్వామ్యం లేకపోవడం వల్లనో, సామర్థ్యం పెంచుకోవాలన్న ఉద్దేశంతోనో.. ప్రైవేట్ పార్ట్‌తో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు.

Viral News: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్ట్‌లోకి బ్యాటరీలు.. ఆ తర్వాత ఏమైందంటే?

తమ సంతృప్తి కోసం కొందరు వ్యక్తులు విచిత్రమైన పనులకు పాల్పడుతుంటారు. భాగస్వామి లేకపోయినప్పుడో, సామర్థ్యం పెంచుకోవాలన్న ఉద్దేశంతోనో.. తమ ప్రైవేట్ పార్ట్‌తో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు. బటన్ సైజ్‌లో ఉండే మూడు బ్యాటరీలను తన ప్రైవేట్ పార్ట్‌లోకి జొప్పించాడు. అయితే.. అవి లోపలే చిక్కుకుపోవడంతో, సర్జరీ చేసి వాటిని బయటకు తీయాల్సి వచ్చింది. గతేడాది మార్చి నెలలో ఈ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా ‘యురాలజీ కేసు రిపోర్ట్స్’లో ఒక అధ్యయనం ప్రచురించారు.


అధ్యయనం ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన ఆ వ్యక్తి వయసు 73 ఏళ్లు. సంతృప్తి కోసం అతను తన మూత్రనాళంలోకి బ్యాటరీలను చొప్పించుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. గతంలో ఇలా పలుసార్లు చేసి, ఎలాంటి సమస్య లేకుండా సులభంగానే వాటిని స్వయంగా తొలగించుకున్నాడు. కానీ.. ఈసారి మాత్రం కథ అడ్డం తిరిగింది. బ్యాటరీలను బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ప్రయత్నంలో భాగంగా.. ఆ బ్యాటరీలు ‘పెనిల్ యురేత్ర’ వద్ద ఆగిపోయాయి. దీంతో.. అతని ప్రైవేట్ పార్ట్ వద్ద తీవ్ర నొప్పి మొదలైంది. ఈ బాధను భరించలేక అతను చివరికి వైద్యులను సంప్రదించాడు. తన సమస్యని వారికి చెప్పుకొని, బ్యాటరీలను తొలగించాలని కోరాడు.

ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరిన అనంతరం పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. వెంటనే ప్రైవేట్ పార్ట్‌లో నుంచి ఆ మూడు బ్యాటరీలను తొలగించారు. మరో రెండు గంటల పాటు ఆ బ్యాటరీలు అలాగే ఉండి ఉంటే.. నెక్రోసిస్ (శరీర కణజాల మరణం) అనే సమస్య తలెత్తేదని వైద్యులు గుర్తించారు. అంతేకాదు.. ప్రభావితం చేసే ఒక ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం గురించి కూడా భయపడ్డారు. అయితే.. శస్త్రచికిత్స చేసిన 10 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో వాపు వచ్చింది. దీంతో.. వైద్యులు మరోసారి ఆపరేషన్ చేశారు. ఎక్స్‌టెన్సివ్ డిగ్రీ నెక్రోసిస్ అభివృద్ధి చెందుతుందని గ్రహించిన వైద్యులు.. మూత్రనాళంలో కొంత భాగాన్ని తొలగించాల్సి ఉంటుందని అధ్యయనం తెలిపింది.

Updated Date - Feb 21 , 2024 | 06:19 PM