Share News

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ గురువు చిన్మయపై దేశద్రోహం

ABN , Publish Date - Nov 02 , 2024 | 03:39 AM

ప్రముఖ హిందూ సాధువు, ఇస్కాన్‌ గురువు చిన్మయ కృష్ణపై బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది.

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ గురువు చిన్మయపై దేశద్రోహం

ఢాకా, నవంబరు 1: ప్రముఖ హిందూ సాధువు, ఇస్కాన్‌ గురువు చిన్మయ కృష్ణపై బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మొత్తం 19 మంది మైనార్టీ నేతలపై ఈ కేసులు నమోదు చేశారు. దీంతో బంగ్లాదేశ్‌లోని మైనార్టీలు ఆందోళనలు తీవ్రం చేశారు. రాజధాని ఢాకాతో పాటు అనేక చోట్ల మైనార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మహ్మద్‌ యూనిస్‌ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షేక్‌ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయాక బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలపై 2వేల సార్లు దాడులు జరిగాయని ఆరోపించారు.

Updated Date - Nov 02 , 2024 | 03:39 AM