Bangladesh Riots: సంగీత వాయిద్యాలు ధ్వంసం..!!
ABN , Publish Date - Aug 07 , 2024 | 01:54 PM
రిజర్వేషన్ల రగడతో బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువత, ప్రజల టార్గెట్ మాత్రం హిందువులు, వారి ఇళ్లు అని తెలుస్తోంది. ఎక్కడ హిందువు ఇళ్లు, వ్యాపారి బిల్డింగ్ కనిపిస్తే చాలు.. ధ్వంసం చేసేందుకు క్షణం కూడా ఆలోచించడం లేదు. బంగ్లాదేశ్ అలర్లి మూకల చేతిలో ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద ఉంటోన్న ఇళ్లు ధ్వంసమైంది. 140 ఏళ్ల సంస్కృతికి అద్దం పట్టే గల ఇళ్లు చరిత్రగా మిగిలింది.
ఢాకా: రిజర్వేషన్ల రగడతో బంగ్లాదేశ్‌లో (Bangladesh) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువత, ప్రజల టార్గెట్ మాత్రం హిందువులు, వారి ఇళ్లు అని తెలుస్తోంది. ఎక్కడ హిందువు ఇళ్లు, వ్యాపారి బిల్డింగ్ కనిపిస్తే చాలు.. ధ్వంసం చేసేందుకు క్షణం కూడా ఆలోచించడం లేదు. బంగ్లాదేశ్ అలర్లి మూకల చేతిలో ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద ఉంటోన్న ఇళ్లు ధ్వంసమైంది. 140 ఏళ్ల సంస్కృతికి అద్దం పట్టే గల ఇళ్లు చరిత్రగా మిగిలింది.
పారిపోయిన సింగర్..
ఢాకాలో భార్య, పిల్లలతో కలిసి రాహుల్ ఆనంద ఉండేవారు. అతని ఇంటికి ఘనమైన చరిత్ర ఉంది. ఆ ఇంటిని అతను అద్దెకు తీసుకున్నాడు. ఇంట్లో ఏడాది పొడవునా సంగీత కచేరిలు (జోలెర్ గాన్) నిర్వహించేవారు. గత ఏడాది బంగ్లాదేశ్ వచ్చిన సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాహుల్ కూడా ఆనంద ఇంటిని సందర్శించారు. అంతటి చరిత్ర ఉన్న ఇంటిని అలర్లిమూకలు వదల్లేదు. ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటిని ధ్వంసం చేశారు. విలువైన వస్తువులను దోచుకున్నారు. తర్వాత ఇంటికి నిప్పు అంటించారు. అల్లరి మూకలు రావడాన్ని గుర్తించిన రాహుల్.. భార్య, కుమారుడితో కలిసి పారిపోయారు. ఈ విషయాన్ని డైలీ స్టార్ కథనంలో రాసింది.
సొంత ఇల్లు కాదు..
‘జోలెర్ గాన్' వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన సైఫుల్ ఇస్మాయిల్ ఈ అంశంపై జర్నల్ ది డైలీ స్టార్‌కు వివరించారు. ‘అల్లరిమూకలు రావడంతో రాహుల్ కుటుంబం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతుంది. ఆ ఇల్లు రాహుల్‌ది కాదు.. ఇంటిని అద్దెకు తీసుకున్నాడు అని’ స్పష్టం చేశారు. ఇంట్లో సంగీత కచేరి నిర్వహించేందుకు ప్రత్యేక గది ఉండేది. 3 వేలకు పైగా సంగీత వాయిద్యాలను రాహుల్ సేకరించారు. వాటిని సేకరించేందుకు కొన్నేళ్ల సమయం పట్టింది. కానీ ఏం లాభం.. ఉద్రిక్తల నేపథ్యంలో అల్లరి మూకలు ఇంటికి వచ్చేశారు. ఇంటికి ఉన్న ప్రధాన గేటు పగులగొట్టి చొరబడ్డారు. తమకు ఏది దొరికితే దానిని తీసుకున్నారు. రాహుల్ ఏంతో ఇష్టంతో సేకరించిన సంగీత వాయిద్యాలను వదల్లేదు. ఆపై ఇంటిని తగలబెట్టారని ది డైలీ స్టార్ కథనంలో పేర్కొంది.