Bangladesh: ఆయుధం ఉంటే అంతే సంగతులు..!!
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:52 PM
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సద్దుమణగలేదు. ఆందోళనకారులు తమ ఆయుధాలు వీడలేదు. యువత వద్ద ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. కొన్ని వీడియోలు అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువత వద్ద ఆయుధాలు, రైఫిల్స్ ఉంచుకోవద్దని తేల్చి చెప్పింది. ఒకవేళ మీ వద్ద ఆయుధాలు ఉంటే ఆగస్ట్ 19వ తేదీ లోపు సమీపంలో గల పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించింది.
ఢాకా: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సద్దుమణగలేదు. ఆందోళనకారులు తమ ఆయుధాలు వీడలేదు. యువత వద్ద ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. కొన్ని వీడియోలు అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం (Interim Government) కీలక ప్రకటన చేసింది. యువత వద్ద ఆయుధాలు, రైఫిల్స్ ఉంచుకోవద్దని తేల్చి చెప్పింది. ఒకవేళ మీ వద్ద ఆయుధాలు ఉంటే ఆగస్ట్ 19వ తేదీ లోపు సమీపంలో గల పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించింది.
ఎత్తుకెళ్లి..
రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్‌లో యువత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వారికి ప్రజలు మద్దతు ప్రకటించారు. దాంతో రోడ్లమీదకి వచ్చిన ఆందోళనకారులు.. పోలీస్ స్టేషన్, భద్రతా సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాలను లాక్కెళ్లారు. యువత ఆందోళన నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. తలదాచుకునేందుకు పొరుగున గల భారతదేశానికి వచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ షేక్ హసీనా మనిషి అని, అతన్ని రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ జారీచేశారు. దాంతో చీఫ్ జస్టిస్ కూడా రిజైన్ చేశారు. మహ్మద్ యూనాస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం నిర్వహించేందుకు యూనాస్‌కు 16 మంది సలహాదారులు సేవలు అందిస్తారు.
పీఎస్‌లో అప్పగించాలి..
ఇప్పటికీ కూడా కొందరి వద్ద ఆయుధాలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారుల బ్రిగేడియర్ జనరల్ ఎం షేకావత్ హుస్సేన్ కీలక ప్రకటన చేశారు. ఆయుధాలు, రైఫిళ్లను వచ్చే సోమవారం లోపు పోలీసు స్టేషన్లలో అందజేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత అధికారులు ఇళ్లలోకి వచ్చి తనిఖీ చేపడతారని వివరించారు. ఆ సమయంలో ఇంట్లో ఆయుధాలు లభిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ద డైలీ స్టార్ పత్రిక ఓ కథనం రాసింది.
Read More International News and Latest Telugu News