Share News

Joe Biden: ట్రంప్ ఓడితే... జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 08 , 2024 | 03:08 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) సంచలన సమాధానం ఇచ్చారు.

Joe Biden: ట్రంప్ ఓడితే... జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) సంచలన సమాధానం ఇచ్చారు. ట్రంప్ ఓడిపోతే 2025 జనవరిలో అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని బైడెన్ స్పష్టం చేశారు.


ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సందేహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికలు పూర్తయ్యాక జనవరిలో అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందా, లేదా? అన్న ప్రశ్నకు బైడెన్ మాట్లాడుతూ.. ట్రంప్ ఓడితే.. కమలాకు ప్రశాంతంగా అధికారాన్ని చేపట్టనిస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. 2021లో జరిగిన క్యాపిటెల్ హిల్ ఘటనను ఆయన ఉదహరించారు.


ట్రంప్ మద్దతుదారుల అరాచకం..

2021లో డెమొక్రటిక్ పార్టీ(Democratic Party) అభ్యర్థిగా పోటీ చేసిన జో బైడెన్ తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించారు. అయితే ఆ విజయాన్ని జీర్ణించుకోలేని ట్రంప్ మద్దతుదారులు ఏకంగా క్యాపిటల్ హిల్‌పై దాడికి దిగారు. బైడెన్‌ గెలుపును కన్ఫార్మ్ చేసేందుకు కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశం కాగా, వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

హిల్ బారికేడ్లు దాటుకొని, గోడలు ఎక్కి భవనం లోపలికి వచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అనుభవాల నేపథ్యంలో జో బైడెన్ తాజా వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మాట్లాడిన వీడియో ఆదివారం ప్రసారం కానుంది.

ఇవి కూడా చదవండి...

RJ Shekhar: జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు

Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2024 | 03:08 PM