Share News

కెనడాలో శాశ్వత నివాసానికి దరఖాస్తులు

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:30 AM

తమ దేశానికి వలసల సంఖ్యను పెంచడానికి కెనడా సిద్ధమైంది. ప్రొవిన్షియల్‌ నామినీ ప్రోగ్రామ్‌ (పీఎన్‌పీ) కింద విదేశీ పౌరులు శాశ్వత నివాస హోదా పొందేందుకు ట్రూడో ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కెనడాలో శాశ్వత నివాసానికి దరఖాస్తులు

1,085 మందికి అవకాశం కల్పించిన ట్రూడో ప్రభుత్వం

భారతీయ నిపుణులకు భారీ లబ్ధి చేకూరే అవకాశం

న్యూఢిల్లీ, డిసెంబరు 19: తమ దేశానికి వలసల సంఖ్యను పెంచడానికి కెనడా సిద్ధమైంది. ప్రొవిన్షియల్‌ నామినీ ప్రోగ్రామ్‌ (పీఎన్‌పీ) కింద విదేశీ పౌరులు శాశ్వత నివాస హోదా పొందేందుకు ట్రూడో ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికోసం ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ సిస్టమ్‌ (ఈఈఎస్‌) ద్వారా మొత్తం 1,085 మంది నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖ(ఐఆర్‌సీసీ) ఈ నెల 16న ప్రకటన విడుదల చేసింది. ఇదే కార్యక్రమం కింద ఈ నెల 2న 672 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తాజా నిర్ణయంతో కెనడాలో శాశ్వత నివాసం పొందాలని భావించే భారతీయ వృత్తి నిపుణులకు బారీ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. విదేశీ పౌరులు నిర్దిష్ట ప్రావిన్స్‌లో నివసించడానికి, పనిచేయడానికి పీఎన్‌పీ అనుమతిస్తుంది.

Updated Date - Dec 20 , 2024 | 03:31 AM