Share News

Viral Video: కుండపోత వర్షాలతో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన కార్లు

ABN , Publish Date - Oct 30 , 2024 | 09:51 AM

దంచికొట్టిన వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో అనేక చోట్ల రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. ఈ క్రమంలో మరికొన్ని చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విమాన, రైలు ప్రయాణాలపై కూడా ప్రభావం పడింది. వరదలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: కుండపోత వర్షాలతో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
Spain viral video

స్పెయిన్‌(Spain)లోని తూర్పు ప్రాంతమైన వాలెన్సియాలో కుండపోత వర్షాల(rains) కారణంగా వరదలు(floods) పెద్ద ఎత్తున పోటెత్తాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతోపాటు పలు చోట్ల రోడ్లపై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోయాయి. పలు వాహనాలు కొట్టుకుపోవడంతో పలువురు గల్లంతయ్యారు. దీంతో ఆయా ప్రాంతాల్లోనే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా మారింది.


ప్రయాణాలపై ప్రభావం

వరదల కారణంగా రైలు, విమాన ప్రయాణాలపై ప్రభావం పడింది. వాలెన్సియా విమానాశ్రయంలో దిగాల్సిన 12 విమానాలను స్పెయిన్‌లోని ఇతర నగరాలకు మళ్లించినట్లు స్పానిష్ విమానాశ్రయ ఆపరేటర్ ఐనా తెలిపారు. బుధవారం విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన లేదా రావాల్సిన ఇతర 10 విమానాలు రద్దు చేయబడ్డాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు వాలెన్సియా ప్రాంతంలో అన్ని రైలు సేవలను నిలిపివేసినట్లు నేషనల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆపరేటర్ ADIF తెలిపింది.


స్కూల్స్ బంద్

మరోవైపు వాలెన్సియా సిటీ హాల్ ప్రాంతంలో అన్ని పాఠశాల తరగతులు, క్రీడా కార్యక్రమాలు బుధవారం రద్దు చేశారు. దీంతోపాటు పార్కులు సహా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా కనీసం ఏడుగురు గల్లంతైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వాలెన్సియాలో ఒక ట్రక్ డ్రైవర్, ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు. డ్రోన్‌ల సహాయంతో అత్యవసర సేవల కార్మికులు లెటూర్‌లో తప్పిపోయిన వ్యక్తుల కోసం రాత్రంతా పని చేశారని అధికారులు అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు రావడంతో అత్యవసర సేవా సిబ్బంది పలు మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం సమాచారం అందించింది.


పట్టాలు తప్పిన ట్రైన్

మాడ్రిడ్ నుంచి అండలూసియాకు 276 మంది ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పినప్పటికీ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వరదల కారణంగా ఆయా ప్రాంతాల్లోని పలు రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణ సంస్థ AEMET వాలెన్సియాలో రెడ్ అలర్ట్, అండలూసియాలో హై అలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావం కారణంగా మాడ్రిడ్, వాలెన్సియా నగరాల మధ్య హైస్పీడ్ రైళ్లను బుధవారం ఉదయం 10 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.


వీడియోలు వైరల్

వరదలు పెద్ద ఎత్తున రావడంతో అందుకు సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో ఇళ్లలోకి భారీ వరదలు వస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతోపాటు మరికొన్ని చోట్ల కార్లు ఒకదానిపై ఒకటి తీసుకెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Read More International News and Latest Telugu News

Updated Date - Oct 30 , 2024 | 09:53 AM