Share News

China-Taiwan Relations : తైవాన్‌ తీరంలో 90 చైనా యుద్ధ నౌకలు!

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:20 AM

తైవాన్‌ సమీపంలో చైనా భారీగా యుద్ధ నౌకలను మోహరించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీస్థాయిలో వీటిని మోహరించడం గమనార్హం. దాదాపు 90 యుద్ధనౌకలను రంగంలోకి దించింది. చైనా తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. నౌకాదళంతో

China-Taiwan Relations : తైవాన్‌ తీరంలో 90 చైనా యుద్ధ నౌకలు!

చైనా దుందుడుకు చర్య

భారీగా నౌకల మోహరింపుతో ఉద్రిక్తత

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు

సిద్ధంగా ఉన్నట్లు తైవాన్‌ ఆర్మీ వెల్లడి

తైపీ, డిసెంబరు 10: తైవాన్‌ సమీపంలో చైనా భారీగా యుద్ధ నౌకలను మోహరించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీస్థాయిలో వీటిని మోహరించడం గమనార్హం. దాదాపు 90 యుద్ధనౌకలను రంగంలోకి దించింది. చైనా తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. నౌకాదళంతో విన్యాసాలు చేస్తుంటుంది. అయితే ఈ సారి పెద్దఎత్తున నౌకలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జపాన్‌ దక్షిణ ఐలాండ్స్‌ నుంచి దక్షిణ చైనా సుమద్రం వరకు చైనా తన యుద్ధనౌకలను మోహరించిందని తైవాన్‌ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సన్‌లీ ఫాంగ్‌ మంగళవారం తెలిపారు. ఇది 2022లో చేసిన మోహరింపు కంటే చాలా ఎక్కువన్నారు. గతంలో చేసిన విన్యాసాల కంటే అత్యధిక స్థాయిలో యుద్ధనౌకలను మోహరించడాన్ని ముప్పుగానే పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి మొత్తం తైవాన్‌ తీరాన్నే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. తైవాన్‌ తూర్పు తీరంలో దాదాపు గోడ కట్టినట్లుగా చైనా నౌకలను మోహరించిందని తైవాన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఏడు రిజర్వ్‌డ్‌ జోన్లలో మాత్రం ఎలాంటి ఫైర్‌ డ్రిల్స్‌ చేయలేదన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్‌ ఆర్మీ ప్రకటించింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే యుద్ధసన్నద్ధత కార్యకలాపాలు చేపట్టినట్లు తెలిపింది.

Updated Date - Dec 11 , 2024 | 05:20 AM