Donald Trump: 10 శాతం సుంకం విధిస్తామని ప్రకటన
ABN , Publish Date - Nov 26 , 2024 | 02:17 PM
చైనా వస్తువులపై తక్కువ సుంకం విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనను డ్రాగన్ కంట్రీ స్వాగతించింది. అమెరికా-చైనా దేశాలు ఆర్థిక, వాణిజ్య సంబంధాల రెండు దేశాలు మేలు చేస్తాయని అభిప్రాయ పడింది.
దిగుమతి సుంకాలపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డ్రాగన్ చైనాతోపాటు మెక్సికో, కెనడా ఉత్పత్తులపై ఎక్కువ సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. చైనా వస్తువులపై అదనంగా మరో 10 శాతం ట్యాక్స్ ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పారు. జవరి 20వ తేదీన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఇది ఉంటుందని ట్రంప్ ఇండికేషన్ ఇచ్చారు. వాణిజ్య యుద్ధంలో ఏ దేశం విజయం సాధించలేదని, అందరినీ కలుపుకోని పోవాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన డ్రగ్స్, వలసలకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ ప్రకటన చేశారు. చైనా వస్తువులపై తక్కువ సుంకం విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనను డ్రాగన్ కంట్రీ స్వాగతించింది. అమెరికా-చైనా దేశాలు ఆర్థిక, వాణిజ్య సంబంధాల రెండు దేశాలు మేలు చేస్తాయని అభిప్రాయ పడింది.
ఫెంటనిల్ గురించి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. నాడీ వ్యవస్థపై పనిచేసే మందు. హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతం అని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. 2 మిల్లీ గ్రాముల డోసు ప్రాణాంతకం అని తేల్చి చెప్పారు. బానిసలుగా మారిన కొందరు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. 2022లో అమెరికాలో ఫెంటనిల్ హై డోస్ వల్ల లక్ష పైచిలుకు మంది చనిపోయారని తెలుస్తోంది. 2023లో మరింత పెరిగిందని అంచనా వేశారు.
ఫెంటనిల్ మందు మెక్సికోలో క్రిమినల్ గ్యాంగ్ చేతిలో పడటతో సమస్య వచ్చింది. అటు నుంచి దేశవ్యాప్తంగా ఫెంటనిల్ సప్లై జరుగుతోంది. ఫెంటనిల్‌ను చైనాలో తక్కువ ధరకు తయారు చేసి, అమెరికాకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై చైనా దేశంతో చర్చిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. చర్చలు సక్సెస్ కాలేదని వివరించారు. ఫెంటనిల్‌ను చైనా ఆపేవరకు ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.