Share News

Jai Shankar: నాటి హైజాక్ విమానంలో మా నాన్న కూడా ఉన్నారు.. ఆసక్తికర విషయం వెల్లడించిన జైశంకర్

ABN , Publish Date - Sep 13 , 2024 | 08:53 PM

ఇటీవలే విడుదలైన 'ది కాందహార్ హైజాక్' టెలివిజన్ సిరీస్ గురించి ప్రవాస భారతీయుడు ఒకరు జైశంకర్‌ను ప్రశ్నించినప్పుడు ఆ సిరీస్ తాను చూడలేదని చెబుతూనే 1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Jai Shankar: నాటి హైజాక్ విమానంలో మా నాన్న కూడా ఉన్నారు.. ఆసక్తికర విషయం వెల్లడించిన జైశంకర్

జెనీవా: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) తన నిజజీవితంలో ఎదుర్కొన్న ఆసక్తికరమైన ఫ్లయింట్ హైజాక్ (Flight Hijack) ఘటనను చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ హైజాకింగ్ విమానంలో స్వయంగా తన తండ్రి ఉన్నట్టు చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రవాస భారతీయులతో జరిగిన ఒక కార్యక్రమంలో వారడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.


ఇటీవలే విడుదలైన 'ది కాందహార్ హైజాక్' టెలివిజన్ సిరీస్ గురించి ప్రవాస భారతీయుడు ఒకరు జైశంకర్‌ను ప్రశ్నించినప్పుడు ఆ సిరీస్ తాను చూడలేదని చెబుతూనే 1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ''1984లో ఒక విమానం హైజాక్ అయింది. ఆ విమానంలో మా నాన్నగారు కూడా ఉన్నారు. అప్పుడే నేను కొత్తగా ఉద్యోగంలో చేరాను. విమానం హైజాగ్ ఘటనను డీల్ చేసిన బృందంలో నేనూ ఉన్నాను. అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రావడం కుదరని చెప్పాను. ఆ తర్వాత హైజాక్ అయిన విమానంలో మా నాన్న ఉన్నారని తెలిసింది. అప్పడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక వైపు హైజాక్ అయిన బృందంలో పనిచేస్తూ, హైజాక్‌పై ప్రభుత్వాన్ని నిలదీసిన కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఉన్నాను'' అని చెప్పారు. హైజాక్ విమానం కథ దుబాయ్‌లో సుఖాంతమైందని, అదృష్టవశాత్తూ విమానంలో ఉన్న వారంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.

Hamza bin laden: బతికే ఉన్న బిన్ లాడెన్ కొడుకు.. మళ్లీ ఊపిరి పోసుకుంటున్న అల్‌ ఖైదా!


నాటి హైజాక్ ఘటన

ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం 1984 జూలై 5న హైజాక్ అయింది. పఠాన్‌కోట్ నుంచి దుబాయ్‌కి హైజాక్ చేశారు. 36 గంటల తర్వాత, 12 మంది ఖలిస్థాన్ అనుకూల హైజాకర్లు అధికారులకు సరెండర్ అయ్యారు. ఆరుగురు విమాన సిబ్బందితో సహా 68 మంది ప్రయాణికులకు ఎలాంటి హాని చేయకుండా విడిచిపెట్టారు. ఐఎఫ్ఎస్ అధికారి అయిన జైశంకర్ తన రిటైర్మెంట్ తర్వాత మంత్రి అయ్యారు. ఆయన తండ్రి కె.సుబ్రహ్మణం ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. వ్యూహాత్మక అంశాలపై తరచు కామెండరేటర్‌గా వ్యవహరిస్తుంటారు.


ReadLatestandInternationalNews

Updated Date - Sep 13 , 2024 | 08:53 PM