Donald Trump: డోనాల్డ్ ట్రంప్‌కు షాకింగ్ న్యూస్..ఆ రిపోర్టర్లకు $400,000 చెల్లించాలని కోర్టు ఆదేశం
ABN , Publish Date - Jan 13 , 2024 | 12:13 PM
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు న్యూయార్క్ సుప్రీంకోర్ట్ షాకిచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ న్యూయార్క్ టైమ్స్, దాని విలేఖరులకు 400,000 డాలర్లు (రూ.3,31,48,940) చెల్లించాలని ఆదేశించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు న్యూయార్క్ సుప్రీంకోర్ట్ షాకిచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ న్యూయార్క్ టైమ్స్, దాని విలేఖరులకు 400,000 డాలర్లు (రూ.3,31,48,940) చెల్లించాలని ఆదేశించింది. ఇక అసలు విషయానికి వస్తే డోనాల్డ్ ట్రంప్ సంపద, పన్ను విధానాల గురించి 2018లో న్యూయార్క్ టైమ్స్, ముగ్గురు పరిశోధనాత్మక జర్నలిస్టుల కథనానికి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది.
ఆ తర్వాత 2021లో డొనాల్డ్ ట్రంప్ ఆ కథనంపై దావా వేశారు. తన ఫ్యామిలీ నుంచి విడిపోయిన మేనకోడలు మేరీ ట్రంప్ ఆ రిపోర్టర్లకు పన్ను రికార్డులను ఇచ్చి సెటిల్మెంట్ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ట్రంప్ ఆరోపించారు. మేరీ ట్రంప్‌తో ముందస్తు సెటిల్‌మెంట్ ఒప్పందాన్ని విలేకరులకు తెలుసని అన్నారు. వారి కుటుంబ పితృస్వామ్యుడైన ఫ్రెడ్ ట్రంప్ ఆస్తికి సంబంధించిన వివాదంలో మేరీ ట్రంప్ ఈ పత్రాలను అందుకున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IndiGo: పొగమంచు ఎఫెక్ట్.. గౌహతికి వెళ్లాల్సిన ఇండిగో విమానం దారి మళ్లింపు
ఈ నేపథ్యంలో గత సంవత్సరం వారిపై ట్రంప్ వేసిన దావాను న్యూయార్క్(new york) జడ్జి రాబర్ట్ రీడ్ శుక్రవారం తోసిపుచ్చారు. విలేఖరులు భయపడకుండా చట్టపరమైన వార్తా సేకరణ కార్యకలాపాలలో పాల్గొనడానికి అర్హులని కోర్టులు చాలా కాలంగా గుర్తించాయని తెలిపింది. 2018 కథనం ప్రకారం డొనాల్డ్ ట్రంప్, అతని తండ్రి ఆస్తులను తక్కువగా అంచనా వేయడం ద్వారా షామ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం వంటి పద్ధతులతో బహుమతి, వారసత్వ పన్నులను నివారించారని ప్రస్తావించారు. ఆ క్రమంలో అతని తండ్రి, అతని కంపెనీలకు సంబంధించిన పన్ను రిటర్న్‌లతో సహా 100,000 పేజీల ఆర్థిక పత్రాల ఆధారంగా ఇది రూపొందించబడిందని వార్తా నివేదిక పేర్కొంది.