Citizenship Rights : పుట్టుకతో పౌరసత్వ హక్కును రద్దు చేస్తా
ABN , Publish Date - Dec 11 , 2024 | 06:08 AM
ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న ‘పుట్టుకతో పౌరసత్వ హక్కు’ను.. తాను పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే తొలగిస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఆ గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికీ ఆ
పాలన పగ్గాలు చేపట్టగానే ఉత్తర్వు: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్, డిసెంబరు 10: ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న ‘పుట్టుకతో పౌరసత్వ హక్కు’ను.. తాను పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే తొలగిస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఆ గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికీ ఆ దేశ పౌరసత్వం వస్తుంది. పర్యాటక/విద్యార్థి/ఉద్యోగ వీసాపై వచ్చేవారి పిల్లలకే కాదు.. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారికి పుట్టే పిల్లలకు సైతం పౌరసత్వం ఇవ్వకుండా ఎవరూ అడ్డుకోలేరు. అలా ఇచ్చేయడం హాస్యాస్పదమని.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే దీనికి ముగింపు పలుకుతానని ‘ఎన్‌బీసీ న్యూస్’ వార్తా సంస్థ నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ తేల్చిచెప్పారు.