Donald Trump: నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే రక్తపాతం తప్పదు
ABN , Publish Date - Mar 17 , 2024 | 09:42 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒహియోలోని డేటన్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ర్యాలీలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు(america president elections 2024) ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అమెరికా(america) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald Trump) ఒహియోలోని డేటన్(Dayton)లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ర్యాలీలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను ఇప్పుడు ఎన్నిక కాకపోతే, ఇక్కడ రక్తపాతం(bloodbath) జరుగుతుందని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ ఈ ప్రకటనలో అర్థం ఏమిటో స్పష్టంగా తెలియాల్సి ఉంది. వాస్తవానికి ట్రంగ్ ఈ వార్నింగ్ ఇచ్చిన సమయంలో అమెరికాలో ఆటోమొబైల్ పరిశ్రమపై ఫిర్యాదు చేశారు. ఓ నివేదిక ప్రకారం ట్రంప్ ప్రజలను ఉద్దేశించి తాను తిరిగి ఎన్నికైతే యుఎస్‌లో చైనా దిగుమతి వాహనాలను విక్రయించదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు(america president elections 2024) జరగనున్న వేళ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించకపోతే అమెరికన్ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. 2020 ఎన్నికల్లో డెమొక్రటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎన్నికల మోసం కారణంగానే తాను ఓడిపోయానని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఒకవేళ తాను ఎన్నికల్లో ఓడిపోతే.. దేశంలో మరో ఎన్నికలు వస్తాయో లేదోనని డౌటన్‌లో బహిరంగ ప్రసంగం సందర్భంగా ట్రంప్(trump) ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి నా అవసరం ఉందని, నేను గెలవకపోతే రక్తస్నానం, రక్తనదులు ప్రవహిస్తాయని అన్నారు.
మరోవైపు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో 2024లో ట్రంప్‌నకు మద్దతు ఇచ్చేది లేదని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్(us vice president mike pence) ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్లలో మేము పాలించిన సాంప్రదాయిక ఎజెండాకు విరుద్ధమైన ఎజెండాను ముందుకు తీసుకువెళుతున్నారని ఆయన అన్నారు. అందుకే తాను ఈ ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేనని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald Trump) జనవరి 6, 2021న క్యాపిటల్ హిల్ హింస కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అది ఇంకా అయిపోలేదు. ట్రంప్ కొన్ని గంటల పాటు కటకటాల వెనక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశంలో శాంతికాముక ఓటర్లను బెదిరిస్తున్నారా అనే ప్రశ్నలు ఆయనపై తలెత్తుతున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Vladimir Putin: రష్యాలో కొనసాగుతున్న పోలింగ్.. మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్ ఫిక్స్!