Israeil vs Iran: ఇజ్రాయెల్ - ఇరాన్ ఉద్రిక్తతలపై ఎలాన్ మస్క్ స్పందన.. మంచి మెసేజే ఇచ్చారుగా
ABN , Publish Date - Apr 19 , 2024 | 09:26 PM
ఇజ్రాయెల్ - ఇరాన్(Israeil - Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా ఉండటంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం ఇచ్చారు.
వాషింగ్టన్: ఇజ్రాయెల్ - ఇరాన్(Israeil - Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా ఉండటంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం ఇచ్చారు. ఆయన ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌లో ‘ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు, క్షిపణులు వేసుకోవడం కాదు. బదులుగా అంతరిక్షంలోకి వాటిని పంపాలి’ అని పేర్కొన్నారు.
తన పోస్ట్‌కు ఒక రాకెట్ ఫొటోను కూడా జత చేశారు. 2023 నవంబర్ లో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్‌లో రెండు రోజులపాటు పర్యటించారు. హమాస్ దాడి ప్రాంతాలను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఎలాన్ మస్క్‌కు చూపించారు.
ఆ పర్యటన తర్వాత మస్క్‌ని గాజా సందర్శన కోసం హమాస్ ఆహ్వానించింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తమ ప్రాంతం ఎలా ధ్వంసమైందో చూడాలని కోరింది. స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ నెట్ వర్క్ స్టార్ లింక్ ఇజ్రాయెల్‌తోపాటు, గాజా స్ట్రిప్ లో సేవలు అందించేందుకు 2024 ఫిబ్రవరిలో లైసెన్స్ పొందింది. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులను తక్షణం ఆపాలని సందేశం ఇచ్చేలా ఎలాన్ మస్క్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
సిరియా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్(Iran) దాడి తరువాత సైలెంట్‌గా ఉన్న ఇజ్రాయెల్(Israel).. వరుస క్షిపణుల(Missiles) దాడితో రెచ్చిపోతోంది. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించింది. శుక్రవారం ఉదయం సమయంలో ఇరాన్‌లో భారీ పెలుళ్లు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ దాడి విషయాన్ని అమెరికాకు చెందిన సైనికాధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం సంచలనం రేపుతోంది.
తమ దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. తాము భారీ దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ మిగలదని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు.ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్.. ఇరాన్‌పై క్షిపణి దాడుల చేసింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరం లక్ష్యంగా ఈ క్షిపణులను ప్రయోగించింది ఇజ్రాయెల్.
వాస్తవానికి ఇస్ఫహాన్ ఇరాన్‌లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇస్ఫహాన్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు సిరియాపై కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం అందుతోంది.
ఇవికూడా చదవండి:
టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..