Former Harvard President: మాజీ హార్వర్డ్ ప్రెసిడెంట్‌కు చంపేస్తామని బెదిరింపులు
ABN , Publish Date - Jan 04 , 2024 | 03:46 PM
హార్వర్డ్ యూనివర్శిటీ మాజీ అధ్యక్షురాలు(Former Harvard President) క్లాడిన్ గే(Claudine Gay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ఈమెయిల్ ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని తెలిపారు.
హార్వర్డ్ యూనివర్శిటీ మాజీ అధ్యక్షురాలు(Former Harvard President) క్లాడిన్ గే(Claudine Gay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ఈమెయిల్ ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని తెలిపారు. సెమిటిజం, దోపిడీ ఆరోపణలపై ఆమె తన పదవికి రాజీనామా చేయడానికి ముందు పలుమార్లు N-వర్డ్ పిలిచారని తెలిపారు. అయితే దోపిడీ ఆరోపణలు సహా పలు వివాదాల నేపథ్యంలో ఆమె పదవీకాలం ముగిసింది. హార్వర్డ్ మొదటి నల్లజాతి అధ్యక్షురాలిగా జూలైలో ఆమె ప్రశంసలు పొందిన తర్వాత ఆమె నాటకీయంగా డిసెంబర్ చివరిలో తన పదవికి గుడ్ బాయ్ చెప్పారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత క్యాంపస్‌లో క్లాడిన్ గే పలు వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం జరిగిందని ఆమె చెబుతున్నారు. ఆ తర్వాత క్యాంపస్‌లో అలజడి పెరిగిందని అన్నారు. అంతేకాదు సెమిటిజం వ్యతిరేక పోరాటంలో తన నిబద్ధత ప్రశ్నించబడిందని ఆమె గుర్తు చేశారు. పలు కారణాల నేపథ్యంలో తన మెయిల్ ఇన్‌బాక్స్ మొత్తం మరణ బెదిరింపులతో నిండిపోయిందన్నారు. దీంతోపాటు తాను లెక్కించాల్సిన దానికంటే ఎక్కువ సార్లు తనను N-వర్డ్ అని పిలిచారని ఆమె వెల్లడించారు.