Share News

Donal Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ విజయం.. నిక్కీ హేలీకి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jan 24 , 2024 | 01:13 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా మరోసారి పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక విజయం దక్కింది. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను అధికారికంగా ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు. అత్యంత కీలకమైన న్యూ హాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు.

Donal Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ విజయం.. నిక్కీ హేలీకి ఎదురుదెబ్బ

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా మరోసారి పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక విజయం దక్కింది. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను అధికారికంగా ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు. అత్యంత కీలకమైన న్యూ హాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. అయితే భారత సంతతి వ్యక్తి, ఐరాసలో అమెరికా మాజీ ప్రతినిధి నిక్కీ హేలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూ హాంప్‌షైర్‌లో వెనుకబడ్డారు. అధికారికంగా ఫలితం వెలువడకపోయినప్పటికీ సరళిని బట్టి చూస్తే నిక్కీ హేలీ ఓడిపోవడం ఖాయమైంది. పూర్తి ఫలితం వచ్చాక ఆమె అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండడంతో అస్పష్టత ఏర్పడింది. కాగా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా నిక్కీ హేలీ పనిచేశారు.

కాగా దేశంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్‌ను ఓడించగల ఏకైన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అని రిపబ్లికన్లు భావిస్తున్నారు. ఆమె ఆయనవైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల రేసులో తాను చాలా వెనుకబడి ఉన్నానని గతంలో నిక్కీహేలీ చెప్పారు. దేశంలో జో బిడెన్‌ను ఓడించగల ఏకైక రిపబ్లికన్ ట్రంప్ అని అందరూ భావిస్తున్నాని ఆమె అన్నారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన 2 అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆయన నాలుగు క్రిమినల్ కేసుల్లో కూడా విచారణ జరుగుతోంది. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్‌నే అధ్యక్షుడి రేసులో ఉంచాలని రిపబ్లికన్లు భావిస్తున్నట్టు తేలింది.

Updated Date - Jan 24 , 2024 | 01:13 PM