సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు భార్య విడాకులు
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:37 AM
అధికారాన్ని కోల్పోయిన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యక్తిగతంగానూ ఎదురుదెబ్బ తగలనుంది. రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్ నుంచి విడిపోవాలని ఆయన భార్య అస్మా
రష్యాలో ఆశ్రయం ఇష్టం లేక. పుట్టి పెరిగిన లండన్‌కు
మాస్కో, డిసెంబరు 23: అధికారాన్ని కోల్పోయిన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యక్తిగతంగానూ ఎదురుదెబ్బ తగలనుంది. రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్ నుంచి విడిపోవాలని ఆయన భార్య అస్మా అల్ అసద్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అస్మా.. లండన్‌లో స్థిరపడిన సిరియన్ దంపతులకు పుట్టారు. అక్కడే పెరిగారు. అసద్ కూడా అక్కడే చదువుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. 2000 సంవత్సరంలో అసద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అస్మా కూడా సిరియా వచ్చేసి అసద్‌ను వివాహం చేసుకున్నారు. సిరియాలో తిరుగుబాటుతో అనంతరం వారు రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, రష్యాలో ఉండడం ఇష్టం లేని అస్మా లండన్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రష్యా కోర్టును ఆశ్రయించారని జాతీయ మీడియా పేర్కొంటోంది. అస్మా ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2019లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయింది.