French Airlines: సిబ్బంది సమ్మె.. 70 శాతం విమాన సర్వీసులు రద్దు
ABN , Publish Date - May 25 , 2024 | 06:17 PM
ప్యారిస్‌లోని ఓర్లి ఎయిర్ పోర్ట్‌లో 70 శాతం విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రెంచి పౌర విమానయాన అధికారులు శనివారం ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ఏటీసీ) సమ్మెకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్యారిస్, మే 25: ప్యారిస్‌లోని ఓర్లి ఎయిర్ పోర్ట్‌లో 70 శాతం విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రెంచి పౌర విమానయాన అధికారులు శనివారం ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ఏటీసీ) సమ్మెకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు ఈ విమాన సర్వీసులు ఉండవని పేర్కొన్నారు.
LokSabha Elections: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్.. స్పందించిన ఈసీ
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమ్మె బాట పట్టడం.. ఈ నెలలో ఇది రెండో ఘటన. యూరప్‌లో ఇలాగే ట్రాఫిక్ ఎయిర్ కంట్రోలర్స్ సమ్మెకు దిగడంతో.. వేలాది విమాన సర్వీసులు రద్దైన సంగతి తెలిసిందే. మరో వైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమ్మె బాట పట్టడాన్ని ప్రభుత్వం ఖండించింది. ఇక ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. అటువంటి వేళ ఏటీసీ సిబ్బంది సమ్మె బాట పట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ప్రాన్స్‌లో ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే రెండో ఎయిర్ పోర్ట్‌గా ఓర్లీ ఎయిర్ పోర్ట్ పేరు పొందింది. గతేడాది ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా 32 మిలియన్ల మంది ప్రయాణికులు.. తన గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ఎయిర్ ప్రాన్స్, ట్రాన్స్‌వియాతోపాటు 20 ఎయిర్ లైన్స్‌కు చెందిన విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
LokSabha Elections: ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ఇంకోవైపు ఈ వారంతంలో ఓర్లీ, ప్రెంచ్ విదేశీ భూభాగం మధ్య విమాన సర్వీసులు నడుపుతామని డీజీసీఏ అధికారులు వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ వర్గాలకు యూనియన్ నాయకుల మధ్య ఒప్పందం కుదరడంతో.. వివాదం ముగిసిందని ఎస్ఎన్‌సీటీఏ తెలిపింది. అయితే యుఎన్‌ఎస్ఏ, ఐసీఎన్‌ఏ సిబ్బంది సరిపడనంతగా లేరని వెల్లడించింది.
Read Latest News and International News here