Home » Paris
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ కుమార్ అత్యధికంగా 2.08 మీటర్ల జంప్ చేసి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. దీంతో ఇండియాకు ఆరో బంగారు పతకాన్ని అందించాడు.
పారిస్ పారాలింపిక్స్ 2024 క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురుషుల 60 కేజీల J1 ఈవెంట్లో కాంస్య పతక పోరులో కపిల్ 10-0తో బ్రెజిల్‌కు చెందిన ఎలిటన్ డి ఒలివెరాపై విజయం సాధించి కాంస్యం సాధించాడు.
ప్రపంచ ఛాంపియన్ భారత అథ్లెట్ సచిన్ ఖిలారీ బుధవారం పారిస్ 2024 పారాలింపిక్స్‌లో పురుషుల షాట్‌పుట్ F46 ఈవెంట్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 34 ఏళ్ల భారత పారా అథ్లెట్ తన రెండో ప్రయత్నంలో 16.32 మీటర్ల ఆసియా రికార్డుతో పతకం సాధించింది.
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ 2024లో నితేష్ కుమార్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ (Nitish Kumar) బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ క్రమంలో స్వర్ణం సాధించి భారత్‌కు రెండో గోల్డ్ పతకాన్ని అందించాడు.
పారాలింపిక్స్ 2024లో ఐదో రోజు డిస్కస్ త్రోలో యోగేష్ కథునియా(Yogesh Kathuniya) రజత పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్లో యోగేష్ రజత పతకాన్ని సాధించగా, దేశం మొత్తం పతకాల సంఖ్య 8కి చేరింది.
పారిస్ పారాలింపిక్స్ 2024(paralympics 2024)లో మూడో రోజు భారత్‌కు ఐదో పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్(Rubina Francis) కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
పారాలింపిక్స్‌లో భారత్ రెండో రోజు నుంచే పతకాల వేట ఆరంభించింది. టార్గెట్-25 మెడల్స్ ధ్యేయంతో బరిలోకి దిగిన మన అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ ఒక్క రోజే నాలుగు పతకాలతో ఖుషీ చేశారు. మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ‘డబుల్’ ఆనందాన్ని పంచారు. షూటర్ అవనీ లేఖారా వరుసగా
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్ పోటీలో మనీష్ నర్వాల్ రజతం గెల్చుకున్నాడు. మరోవైపు మహిళల 100 మీటర్ల (టీ35) రేసులో భారత్‌కు చెందిన ప్రీతీ పాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
వైకల్యం వెక్కిరించినా కుంగిపోకుండా.. కాలం నేర్పిన గుణపాఠాలను సవాల్ గా తీసుకొని.. అవరోధాలను అనుకూలంగా మార్చుకున్న పోరాట యోధులు వీళ్లు. ప్రోత్సాహం అంతగా లేకున్నా, అందుబాటులో ఉన్న వనరులను....
దాదాపు మూడు వారాల పాటు సాగిన ఉత్కంఠభరితమైన పారిస్ ఒలింపిక్స్(paris olympics 2024) గేమ్స్ నేటి రాత్రితో(ఆగస్ట్ 11న) ముగియనున్నాయి. భారత్‌కు గతసారి కంటే ఒక పతకం తక్కువ వచ్చింది. కానీ భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి దేశప్రజల హృదయాలను గెలుచుకున్నారు.