Share News

Greece : గ్రీస్‌లో కార్చిచ్చు బీభత్సం

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:44 AM

గ్రీస్‌ను కార్చిచ్చు కమ్మేసింది. మంటలు రాజధాని ఏథెన్స్‌ను వేగంగా సమీపిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నికీలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Greece : గ్రీస్‌లో కార్చిచ్చు బీభత్సం

ఏథెన్స్‌, ఆగస్టు 12: గ్రీస్‌ను కార్చిచ్చు కమ్మేసింది. మంటలు రాజధాని ఏథెన్స్‌ను వేగంగా సమీపిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నికీలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు దాదాపు 700 అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు.

17 వాటర్‌ డ్రాపింగ్‌ విమానాలు, 16 హెలికాప్టర్లను మోహరించారు. అయినా అగ్నికీలలు అదుపులోకి రావడంలేదని సోమవారం అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది, ముగ్గురు పౌరులు గాయపడ్డారని చెప్పారు.

‘‘ఆదివారం మధ్యాహ్నం వరకు మంటలు ఏథెన్స్‌ నగరానికి 35 కిమీ దూరంలో ఉన్నాయి. బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. గాలుల కారణంగా మంటలను అడ్డుకోవడం కష్టంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అగ్ని కీలలు 25 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ కారణంగా స్థానికులు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలిస్తున్నాం. దేశంలో సగం ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశాం’’ అని అధికారులు తెలిపారు. కాగా, గత సంవత్సరం కూడా కార్చిచ్చు కారణంగా 20 మంది వరకు మరణించారు.

Updated Date - Aug 13 , 2024 | 04:44 AM