Home » Fire Accident
Fire Accident: అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ఆ వివరాలు..
తనకు ఏమైనా సహిస్తుంది.. భరిస్తుంది కానీ బిడ్డల విషయానికి వస్తే.. మాత్రం అందుకు పూర్తిగా విభన్నంగా ప్రవర్తింది తల్లి. వారి కోసం చావుతో సైతం పోరాడుతుంది. బిడ్డల క్షేమం కోసం ఓ తల్లి ఎలాంటి సాహసం చేయగలదో కళ్లకు కట్టినట్లు చూపే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
Gujarat Firecracker Factory: గుజరాత్లోని దీశ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫైర్ క్రాకర్స్ తయారీ ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు నడుస్తున్నాయి.
ఆ అపార్ట్మెంట్ సీపీ కెమెరాలు లేవు. ఘటన సమీపంలో మహిళ వెళుతున్నట్టు సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతో పోలీసులు ఆమె అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది.
Hyderabad Fire Incident: హైదరాబాద్ నగరాన్ని అగ్నిప్రమాదాలు వరుసగా వెంటాడుతూనే ఉన్నాయి. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ నాచారంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
మంటలు ఒక్కసారిగా చుట్టుపక్కలకు విస్తరించడం, పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. మంటల్లో సుమారు ఏడు ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలోని హోటల్లో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. లోపల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 400 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు..
విజయవాడలో రోడ్డుపై వెళ్తున్న అంబులెన్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇతర వాహనదారులు అప్రమత్తం చేయడంతో రహదారిపైనే అంబులెన్స్ ఆపేసి డ్రైవర్ దిగిపోయాడు.