Share News

Doraemon: చిన్నారులు మీకో బ్యాడ్ న్యూస్.. డోరెమాన్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మృతి

ABN , Publish Date - Oct 13 , 2024 | 08:09 PM

పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ సిరీస్ 'డోరెమాన్' . పెద్దవాళ్లలో కూడా డోరెమాన్ ఇష్టపడేవారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇందులోని క్యారెక్టర్స్, వాటి స్టోరీలను పిల్లలు గంటలతరబడి చూస్తుంటారు.

Doraemon: చిన్నారులు మీకో బ్యాడ్ న్యూస్.. డోరెమాన్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మృతి

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ సిరీస్ 'డోరెమాన్' . పెద్దవాళ్లలో కూడా డోరెమాన్ ఇష్టపడేవారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇందులోని క్యారెక్టర్స్, వాటి స్టోరీలను పిల్లలు గంటలతరబడి చూస్తుంటారు. అయితే యానిమేటెడ్ ఇమేజ్‏లతోపాటు బొమ్మల వాయిస్ అంటే పిల్లలకు అమితమైన ఇష్టం. అయితే డోరెమాన్‏ను ఇష్టపడే వారికి ఇది నిజంగా చేదు వార్తే. చాలాకాలంపాటు డోరెమాన్ కు వాయిస్ ఇచ్చిన ఆర్టిస్ట్ కన్నుమూశారు.

జపాన్‌కి చెందిన నోబుయో ఒయామా సెప్టెంబర్ 29న 90 ఏళ్ల వయసులో వృద్ధాప్య కారణాలతో చనిపోయారని అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. 1979లో ఈ షో ప్రారంభమైనప్పటి నుండి 2005 వరకు ఒయామా.. డోరెమాన్ అనే రోబో పిల్లికి తనదైన శైలిలో ఆకట్టుకునే వాయిస్ ఇచ్చారు.ఈ సిరీస్‌ను జపాన్‏తో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వీక్షించారు. దీన్ని 55 భాషల్లోకి అనువదించారు. 2008లో ప్రభుత్వం డోరేమాన్‌ని యానిమే అంబాసిడర్‌గా నియమించడంతో ఈ పాత్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.


ఒయామా గురించి..

జపాన్ రాజధాని టోక్యోలో 1933లో జన్మించిన ఒయామా.. జపాన్ ఎన్‏హెచ్‏కే పబ్లిక్ టెలివిజన్‌లో(1956)లో తన జర్నీని ప్రారంభించారు. 1957లో టీవీ డ్రామా సిరీస్ లాస్సీ డబ్బింగ్ వెర్షన్‌లో ఆమె తన మొదటి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు నటి, గాయకురాలు, స్క్రీన్ రైటర్, రైటర్ కూడా. పరిశ్రమలో చేసిన కృషికిగానూ 2005లో సొసైటీ ఆఫ్ జపనీస్ ఉమెన్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ అవార్డును అందుకున్నారు. అయితే.. ఒయామాకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు 2012లో తేలింది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు కీసుకే సగావా 2015లో చెప్పారు. నోబితా వాయిస్ అయిన నోరికో ఒహారా ఈ ఏడాది జులైలో మరణించిన విషయం తెలిసిందే. డోరెమాన్ సిరీస్ లో రెండు ప్రధాన క్యారెక్టర్ల వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు మరణించడం డోరెమాన్ ప్రియుల్లో విషాదాన్ని నింపింది.

Read Latest Telangana News and National News

Updated Date - Oct 13 , 2024 | 08:16 PM