Share News

నేను ఓడిపోతే.. వెనిజువెలాకు వెళ్లిపోతా!

ABN , Publish Date - Aug 14 , 2024 | 05:20 AM

అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ఏదైనా జరిగి తాను ఓడిపోతే వెనిజువెలాకు వెళ్లిపోతానని, అప్పుడు అమెరికా కంటే అదే సురక్షిత ప్రాంతమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు ఆయన ‘ఎక్స్‌’లో ఇచ్చిన

నేను ఓడిపోతే.. వెనిజువెలాకు వెళ్లిపోతా!

వాషింగ్టన్‌, ఆగస్టు 13: అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ఏదైనా జరిగి తాను ఓడిపోతే వెనిజువెలాకు వెళ్లిపోతానని, అప్పుడు అమెరికా కంటే అదే సురక్షిత ప్రాంతమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు ఆయన ‘ఎక్స్‌’లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసలను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. తాను తిరిగి అధ్యక్షుడినైతే... అమెరికా చరిత్రలో జరగనన్ని బహిష్కరణలు జరుగుతాయని హెచ్చరించారు. దేశంలో లక్షల సంఖ్యలో అక్రమ వలసదారులున్నారని వారందరిని బహిష్కరిస్తామన్నారు. బైడెన్‌ కంటే కమలా హ్యారిస్‌ మరింత అసమర్ధురాలని వ్యాఖ్యానించారు. ఆమె గెలిస్తే అమెరికా నాశమవుతుందన్నారు.

Updated Date - Aug 14 , 2024 | 05:20 AM