Share News

కమలా హారిస్‌ గెలిస్తే... నాకు జైలు తప్పదు!

ABN , Publish Date - Oct 09 , 2024 | 05:15 AM

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కనుక రానున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తనకు జైలు తప్పదని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కమలా హారిస్‌ గెలిస్తే... నాకు జైలు తప్పదు!

డెమొక్రాట్లు గెలిస్తే వలసదారులకు పౌరసత్వం: మస్క్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 8: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కనుక రానున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తనకు జైలు తప్పదని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌తో ఓ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆయన సోమవారం ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఎన్నాళ్లు జైలుశిక్ష పడుతుందో... నా పిల్లలను తిరిగి చూస్తానో లేదో తెలీదు...’’ అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో ట్రంప్‌ గనుక గెలవకపోతే మనకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయి’’ అని పేర్కొన్నారు. లక్షలాదిగా వచ్చే వలసదారులను ప్రోత్సహిస్తోన్న హారి్‌స-బైడెన్‌ ప్రభుత్వం రానున్న కాలంలో వారికి పౌరసత్వం కూడా మంజూరు చేసి వారి ఓట్లను కొల్లగొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోసారి డెమొక్రాట్ల పాలన వస్తే దేశంలో ఏక పార్టీ పాలన వస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Oct 09 , 2024 | 05:15 AM