Share News

United Nations : పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలి

ABN , Publish Date - Dec 05 , 2024 | 05:12 AM

1967 నుంచి తూర్పు జెరూసలెంతో సహా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలంటూ ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) సర్వ ప్రతినిధుల సభలో

United Nations : పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలి

యూఎన్‌లో తీర్మానం.. అనుకూలంగా భారత్‌ ఓటు

ఐక్యరాజ్య సమితి, డిసెంబరు 4: 1967 నుంచి తూర్పు జెరూసలెంతో సహా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలంటూ ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) సర్వ ప్రతినిధుల సభలో మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్‌ ఓటు వేసింది. ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించగా.. భారత్‌తో సహా 157 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌, అర్జెంటీనా సహా ఎనిమిది దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని భారత్‌ తన ఓటు ద్వారా పునరుద్ఘాటించింది. ఇదిలా ఉండగా.. సిరియాకు చెందిన గోలన్‌ హైట్స్‌ నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలన్న మరో తీర్మానానికి కూడా భారత్‌ మద్దతు పలికింది.

Updated Date - Dec 05 , 2024 | 05:12 AM