Share News

Trump: ట్రంప్ నిర్ణయం.. మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు

ABN , Publish Date - Dec 01 , 2024 | 06:48 PM

డొనాల్డ్ ట్రంప్‌నకు కాష్ పటేల్ వీర విధేయుడిగా మంచి గుర్తింపు ఉంది. భారత్‌లోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండ నుంచి కెనడాకు.. అక్కడి నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో గుజరాతీ భారతీయ దంపతులకు కాష్ పటేల్ జన్మించారు.

Trump: ట్రంప్ నిర్ణయం.. మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు

వాషింగ్టన్, డిసెంబర్ 01: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఎన్నికయ్యారు. మరికొద్ది రోజుల్లో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తన కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ క్రమంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన అమెరికన్ కశ్యప్ పటేల్‌ను నామినేట్ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Also Read: ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ లేఖ

కాష్ పటేల్.. ఓ లాయర్, ఇన్వెస్టిగేటర్, అమెరికా ఫస్ట్ ఫైటర్ అంటూ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. కాష్ పటేల్ తన కెరీర్‌ను అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని, అమెరికన్ ప్రజలను రక్షించడం కోసం వినియోగించారని గుర్తు చేశారు. అలాగే అమెరిక కోసం కాష్ పటేల్ వినియోగించిన సేవలను ఈ సందర్భంగా ట్రంప్ సోదాహరణగా వివరించారు.

Also Read: చికెన్ ధరలకు రెక్కలు..!

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియమకంతో.. భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తికి అమెరికాలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు అయింది. ఇప్పటికే వివేక రామస్వామి, జై భట్టాచార్య వంటి ప్రముఖులకు డొనాల్డ్ ట్రంప్ అతున్నత పదవులు కట్టబెట్టిన విషయం విధితమే.

Also Read: పోలి పాడ్యమి రోజు.. ఇలా చేస్తే..

డొనాల్డ్ ట్రంప్‌నకు కాష్ పటేల్ వీర విధేయుడిగా మంచి గుర్తింపు ఉంది. భారత్‌లోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండ నుంచి కెనడాకు.. అక్కడి నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో గుజరాతీ భారతీయ దంపతులకు కాష్ పటేల్ జన్మించారు.

Also Read : తీరం దాటిన ఫెంగల్ తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు

యూనివర్శిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి.. అనంతరం యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌లో న్యాయ శాస్త్రాన్ని విద్యను అభ్యసించారు. ఆ తర్వాత మియామీ కోర్టుల్లో పబ్లిక్‌ డిఫెండర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి వివిధ హోదాల్లో పని చేశారీ కాష్ పటేల్.

For International News And Telugu News

Updated Date - Dec 01 , 2024 | 06:48 PM