USA: రెండు వారాల్లో ఆరో ఘటన.. అమెరికాలో భారతీయ విద్యార్థులకేమైంది..

ABN , First Publish Date - 2024-02-07T13:36:12+05:30 IST

అమెరికాలో(America) చదువుకుంటున్న భారత విద్యార్థుల(Indian Students) వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో 5 మంది అనుమానాస్పదంగా మృతి చెందగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

USA: రెండు వారాల్లో ఆరో ఘటన.. అమెరికాలో భారతీయ విద్యార్థులకేమైంది..

న్యూయార్క్: అమెరికాలో(America) చదువుకుంటున్న భారత విద్యార్థుల(Indian Students) వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో 5 మంది అనుమానాస్పదంగా మృతి చెందగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అగ్రరాజ్యం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌కి చెందిన సమీర్ కామత్ మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి 2021లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందాడు. తరువాత 2021లో పర్డ్యూ యూనివర్సిటీలో చేరాడు.

2023లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతను ఫిబ్రవరి 5న ఓ గార్డెన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఘటనలివే..

వారం రోజుల క్రితం సిన్సినాటీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు. సైనీ అనే యువకుడిని జనవరి చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలోనే చదువుతున్న నీల్ ఆచార్య కూడా ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. 2023 నవంబర్‌లో సిన్సినాటి యూనివర్సిటీకి చెందిన ఆదిత్యను.. ఒహియో నగరంలో కాల్చి చంపారు.

ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 18 ఏళ్ల అకుల్ ధావన్‌ జనవరిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించారు. ఇలా వరుసగా అనుమానాస్పద మరణాలు సంభవించడం.. అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలకు ఆందోళనకు గురి చేస్తోంది. తమ పిల్లలకు ప్రాణ భయం ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2024-02-07T13:37:00+05:30 IST